సంచలన వ్యాఖ్యలు చేసిన సనత్ జయసూర్య
శ్రీలంక : భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఆతిథ్య శ్రీలంక జట్టు అద్భుత విజయాలు సాధిస్తోంది. అంతే కాకుండా ఎవరూ ఊహించని రీతిలో బలమైన , టైటిల్ ఫేవరేట్ గా పేరు పొందిన ఆస్ట్రేలియా జట్టుకు చుక్కలు చూపించింది శ్రీలంక టీం. ఊహించని రీతిలో బిగ్ షాక్ ఇచ్చింది. గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. తమ జట్టు అద్భుత గెలుపు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు శ్రీలంక మాజీ క్రికెటర్, మాజీ మంత్రి సనత్ జయసూర్య. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
శ్రీలంక గ్రాండ్ విక్టరీలో భారత క్రికెట్ కు చెందిన మాజీ ఆటగాళ్లు ఉన్నారని అన్నారు. వారు చేసిన కృషి వల్లనే తమ జట్టులోని ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారని ప్రశంసలు కురిపించారు. మాజీ కోచ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ లు ఇద్దరూ అహోరాత్రులు శ్రమిస్తూ ఆటగాళ్లను రాటుదేలేలా చేశారని పేర్కొన్నారు జయసూర్య. ప్రాక్టీస్‌లో మనం ఏమి చేయాలనుకున్నామో వారు చేస్తున్నారని చెప్పాడు. ఇది ఫీల్డింగ్‌కు నిజంగా మంచిది. తమ ఐపీఎల్ అనుభవం ఆటగాళ్లకు పనికి వస్తుందన్నారు.
“






