Friday, 16 October 2026

newsseals-RavaasuraVahanam

ముగిసిన శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామి ఉత్స‌వాలు
ఘ‌నంగా నిర్వ‌హించిన తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం

తిరుప‌తి : తిరుప‌తిలోని శ్రీ‌నివాస మంగాపురంలోని శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామి ఆల‌యంంలో వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రిగాయి. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో సంయుక్త కార్య నిర్వ‌హ‌ణ అధికారి వి. వీర‌బ్ర‌హ్మం ప‌ర్య‌వేక్ష‌ణలో కొన‌సాగాయి. స్వామి వారిని భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. ఏ ఒక్క భ‌క్తుడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ఇదిలా ఉండ‌గా కపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవం రావణబ్రహ్మ వాహనంతో ముగిసింది.
ఉత్సవ దేవతలు, ఆలయ వీధుల వెంట ప్రత్యేకమైన వాహనంపై భక్తులను ఆశీర్వదించారు.

ఆలయ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ పూజారులు, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా పది రోజుల వార్షిక బ్రహ్మోత్సవం ఘనంగా ముగిసిన సందర్భంగా ధ్వజవరోహణం కూడా జరిగింది. మ‌రో వైపు స్వామి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు తిరుప‌తి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *