బీసీల అభ్యున్న‌తి కోసం ప్ర‌భుత్వం కృషి

Spread the love

స్ప‌ష్టం చేసిన మంత్రి ఎస్. స‌విత

అమ‌రావ‌తి : గ‌త ప్ర‌భుత్వం బ‌హుజ‌నుల బాగోగులు ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. బీసీల అభ్యున్న‌తి కోసం త‌మ కూట‌మి ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌న్నారు. ఏపీలో ఎస్సీ వర్గీకరణంపై నియమించిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా విజయవంతమైన పాత్ర పోషించిందని మంత్రి సవిత తెలిపారు. రాజీవ్ రంజాన్ మిశ్రా సమర్థత గుర్తించిన సీఎం చంద్రబాబు నాయుడు… ఆయన నేతృత్వంలో డెడికేటెట్ కమిషన్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ కమిషన్ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాజీవ్ రంజన్ మిశ్రా ఏక సభ్య డెడికేటెడ్ కమిషన్ నియమించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు. ఇదిలా ఉండ‌గా ఈసారి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశ‌వ్ సార‌థ్యంలో త‌యారు చేసిన 2026-27 బ‌డ్జెట్ అన్ని వ‌ర్గాల‌కు మేలు చేకూర్చేలా ఉంద‌న్నారు. ఈసారి బ‌డ్జెట్ లో బీసీల సంక్షేమం కోసం కోట్లాది రూపాయ‌లు కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు. డెడికేటెట్ కమిషన్ నియామకంపై బీసీ సంఘాలు సైతం హర్షం వ్యక్తం చేశాయి. సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ క‌ళ్యాణ్ కు, మంత్రులు లోకేశ్, సవితకు కృతజ్ఞతలు తెలియజేశారు.

  • Related Posts

    జ‌గ‌న్ డైవ‌ర్ష‌న్ రాజ‌కీయాలు న‌డ‌వ‌వు

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత హైద‌రాబాద్ : రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె శుక్ర‌వారం శాస‌న స‌భ‌లో మీడియా పాయింట్ వ‌ద్ద మాట్లాడారు. అసెంబ్లీ, శాస‌న మండ‌లి…

    ఆంటోనియో గుటెర్రెస్ తో పీఎం భేటీ

    Spread the love

    Spread the loveప్ర‌పంచాన్ని శాసిస్తున్న ఏఐ పై చ‌ర్చ న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో శుక్ర‌వారం చ‌ర్చ‌లు జ‌రిపారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఢిల్లీలో ఇండియా ఇంపాక్ట్ ఏఐ స‌మ్మిట్ 2026లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఇరువురి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *