ద‌క్షిణాఫ్రికాతో సంజు శాంస‌న్ ను ఆడించాలి

ఇక ప్ర‌యోగాలు చేయ‌డం ఆపాల‌న్న అనిల్ కుంబ్లే

బెంగ‌ళూరు : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్, కామెంటేట‌ర్ అనిల్ కుంబ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రస్తుతం భార‌త‌దేశం, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ క్రికెట్ టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త జ‌ట్టు నాలుగు మ్యాచ్ లు ఆడింది. ఇందులో అన్ని మ్యాచ్ ల‌ను వ‌రుస‌గా గెలిచింది డిఫెండింగ్ ఛాంపియ‌న్ టీమిండియా. తాజాగా ఈనెల 22న ఆదివారం బ‌ల‌మైన , టైటిల్ హాట్ ఫెవ‌రేట్ గా పేరు పొందిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుతో ఆడ‌నుంది. ఈ త‌రుణంలో జ‌ట్టు ప‌రంగా చూస్తే ఇంకా కుదురుకోలేదు ఓపెనింగ్ స‌మ‌స్య‌. ప్ర‌ధానంగా ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్న స్టార్ ప్లేయ‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, సంజూ శాంస‌న్ లు ఆశించిన మేర రాణించ‌లేదు. ప్ర‌త్యేకించి అభిషేక్ శ‌ర్మ కంటిన్యూగా డ‌కౌట్ల‌తో ఆశ్చ‌ర్య పోయేలా చేశాడు.

అయినా జ‌ట్టు మేనేజ్మెంట్ , హెడ్ కోచ్ గౌతం గంభీర్ కు త‌ల‌నొప్పిగా మారింది ఓపెనింగ్ వ్య‌వ‌హారం. విచిత్రం ఏమిటంటే అభిషేక్ శ‌ర్మ‌ తన గత ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదు డకౌట్లు సాధించాడు. ముఖ్యమైన మ్యాచ్‌లలో అతని ఫామ్‌ను మీరు నమ్మలేర‌ని అన్నారు ఈ సంద‌ర్బంగా అనిల్ కుంబ్లే. ఇక సంజు శాంస‌న్ ప్రపంచ కప్‌లో ఆడటానికి అర్హుడని స్ప‌ష్టం చేశారు. అత‌డిని ఎందుకు ఎంపిక చేయ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు భార‌త జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్. త‌నను ఎంపిక చేయ‌డం, ఆ త‌ర్వాత బెంచ్ కే ప‌రిమితం చేయ‌డం ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. త‌ప్ప‌కుండా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగే మ్యాచ్ లో శాంస‌న్ ను ఎంపిక చేయాల‌ని సూచించాడు టీం మేనేజ్మెంట్ కు.

  • Related Posts

    తెలంగాణ‌లో రూ. 30 కోట్ల‌తో క్రీడా స‌దుపాయాల క‌ల్ప‌న

    హైద‌రాబాద్ : తెలంగాణ‌కు ఖేలో ఇండియా యూత్ పోటీల నిర్వ‌హ‌ణ‌ను కేటాయించ‌డం ప‌ట్ల పీఎం మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దాదాపు రూ.30 కోట్లతో క్రీడా సదుపాయాల‌ కల్పన జరిగిందన్నారు.…

    మేధావి బిధూరి సోష‌ల్ మీడియాలో వైర‌ల్

    ఢిల్లీ : మ‌హిళా క్రికెట్ రంగంలో మ‌రో తార వెలుగులోకి వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు మేధావి బిధూరి సెన్సేష‌న్ గా మారారు. సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. త‌ను అనుకోకుండా చేసిన హావ‌భావాల‌తో కూడిన వీడియోలు ఇప్పుడు చ‌క్క‌ర్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *