ఎవ‌రి డ‌బ్బుల‌తో శ్రీ‌లంకకు వెళ్లారో చెప్పాలి

మంత్రి నారా లోకేష్ పై పేర్ని నాని కామెంట్స్

అమ‌రావ‌తి : మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పై. ప్ర‌జ‌ల డ‌బ్బుల‌ను నీళ్ల లాగా ఖ‌ర్చు చేస్తున్నార‌ని ఆరోపించారు. తండ్రీ కొడుకులు నారా చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుబారా చేస్తున్నార‌ని అన్నారు. వీరికి తోడు స‌నాత‌న ధ‌ర్మం పేరుతో జ‌నాన్ని బురిడీ కొట్టించ‌డ‌మే కాకుండా ప‌వ‌ర్ ను దుర్వినియోగం చేస్తున్నారంటూ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌ను కూడా ఏకి పారేశారు పేర్ని నాని. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ఓ వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటి ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నం చేయ‌కుండా శ్రీ‌లంక‌లో జ‌రిగే క్రికెట్ మ్యాచ్ చూసేందుకు నారా లోకేష్ వెళ్ల‌డం దారుణ‌మ‌న్నారు. మొత్తంగా ఎక్కుడు దిగుడు త‌ప్పా ఏపీకి వీళ్లు చేసింది ఏమీ లేద‌న్నారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, అక్ర‌మంగా ఈవీఎంల‌ను మ్యానేజ్ చేసిన విష‌యం బ‌య‌ట ప‌డింద‌న్నారు. దీనిని త‌ప్పించుకునేందుకే డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ కు తెర తీశారంటూ ధ్వ‌జ‌మెత్తారు పేర్ని నాని. స్పెషల్ ఫ్లైట్ దుడ్డు మీ అబ్బా అకౌంట్ నుంచి కొన్నారా అని ప్ర‌శ్నించారు. మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మీ దుడ్డుతో ఎన్ని స్పెషల్ ఫ్లైట్ల టికెట్లు కొన్నారో ట్వీట్ చేసే దమ్ము ఉందా అని నిల‌దీశారు మాజీ మంత్రి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *