జ్ఞాన బాండాగారాలుగా గ్రంథాల‌యాలు ఉండాలి

Spread the love

కీల‌క సూచ‌న‌లు చేసిన మంత్రి నారా లోకేష్

అమ‌రావ‌తి : జీవితంలో అత్యున్న‌త‌మైన స్థానానికి చేరుకోవాలంటే త‌ప్ప‌కుండా పుస్త‌కాలు చద‌వాల‌ని అన్నారు ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలో త్వరలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవన నమూనాను పరిశీలించారు. మన ఘన చరిత్ర, వారసత్వానికి చిహ్నంగా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉండాలని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్‌. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, ఆధునిక సాంకేతిక వసతులతో జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ మాట్లాడారు. గ‌త ప్ర‌భుత్వం అన్ని రంగాల‌ను నిర్వీర్యం చేసింద‌ని ఆరోపించారు. ఇదే క్ర‌మంలో కీల‌క‌మైన విద్యా రంగాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గాడి త‌ప్పిన వ్య‌వ‌స్థ‌ల‌ను గాడిలో పెట్టేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. ప్ర‌స్తుతం విద్యార్థుల‌కు మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంతో పాటు నాణ్య‌మైన విద్య‌ను అందిస్తున్నామ‌ని తెలిపారు నారా లోకేష్. ఇదే క్ర‌మంలో మాన‌వ జీవ‌న పురోభివృద్దిలో కీల‌క పాత్ర పోషించే గ్రంథాల‌యాల‌ను అభివృద్ది చేస్తామ‌ని ప్ర‌క‌టించారు .

  • Related Posts

    దేవాదుల ప్రాజెక్టును ప‌ట్టించుకోని స‌ర్కార్

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు సంగారెడ్డి జిల్లా : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, ఎవ‌రు ఏం చేస్తున్నారో తెలియ‌డం లేద‌న్నారు. ప్రాజెక్టులు నీరుగారి పోయాయ‌ని,…

    పట్టణాల అబివృద్ది కోసం ప్ర‌త్యేక‌ నిధులు తెస్తాం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లా : టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే రాజ‌కీయాలు ఉంటాయ‌ని, ఆ త‌ర్వాత అన్ని పార్టీలు క‌లిసిక‌ట్టుగా ముందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *