అభిషేక్ శ‌ర్మ ఆడేది అనుమాన‌మే

Spread the love

ఈనెల 26న జింబాబ్వేతో కీల‌క మ్యాచ్

ముంబై : ఇండియా, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ భార‌త జ‌ట్టు తీవ్ర ఇక్క‌ట్లు ఎదుర్కొంటోంది. ఇప్ప‌టికే సూప‌ర్ -8కి చేరింది టీమిండియా. అయితే టోర్నీలో భాగంగా బ‌ల‌మైన దక్షిణాఫ్రికా జ‌ట్టుతో జ‌రిగిన కీల‌క పోరులో ఊహించ‌ని రీతిలో ఓడి పోయింది. ఈ త‌రుణంలో రేపు గురువారం జింబాబ్వేతో కీల‌క‌మైన మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన 5 మ్యాచ్ ల‌లో స్టార్ హిట్ట‌ర్ అభిషేక్ శ‌ర్మ ఆశించిన మేర ఆడ‌లేక పోయాడు. ఫ్యాన్స్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు. త‌ను ఏకంగా వ‌రుస‌గా నాలుగు సార్లు డ‌కౌట్ అయ్యాడు. వ‌రుస‌గా వైఫ‌ల్యం చెందినా కంటిన్యూ చేయ‌డం ప‌ట్ల భార‌త జ‌ట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ పై భ‌గ్గుమంటున్నారు.

ఈ స‌మ‌యంలో జింబాబ్బేతో జ‌రిగే మ్యాచ్ ఆ జ‌ట్టు కంటే టీమిండియాకు అత్యంత కీల‌కం. ఈ మ్యాచ్ లో అభిషేక్ శ‌ర్మ‌ను త‌ప్పించే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంద‌ని స‌మాచారం. త‌న స్థానంలో సంజూ శాంస‌న్ కు ఆడేదుకు అవ‌కాశం ఉంద‌ని క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త‌న‌ను కేవ‌లం ఒకే ఒక్క మ్యాచ్ కు ప‌రిమితం చేశారు. త‌ను న‌మీబియాతో ఆడిన మ్యాచ్ లో 8 బంతులు ఎదుర్కొని 3 సిక్సులు, 1 ఫోర్ క‌లిపి 22 ర‌న్స్ చేశాడు. ఈ మ్యాచ్ లో శాంస‌న్ తో పాటు ఇషాన్ కిష‌న్ క‌లిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయ‌డం మ‌రింత ఆస‌క్తిని రేపుతోంది. తిల‌క్ వ‌ర్మ‌, సూర్య క‌డా కీ రోల్ పోషించే ఛాన్స్ ఉంది.

  • Related Posts

    డిఫెండింగ్ ఛాంపియ‌న్ సూప‌ర్ షో

    Spread the love

    Spread the loveమ‌రోసారి స‌త్తా చాటిన విరాట్ కోహ్లీ బెంగ‌ళూరు : ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు దుమ్ము రేపుతోంది. వ‌రుస విజ‌యాలతో స‌త్తా చాటుతోంది. ర‌జిత్ పాటిదార్ నాయ‌క‌త్వంలోని ఈ జ‌ట్టు ఊహించ‌ని విధంగా గెలుస్తూ…

    క్రీడా రంగంలో ఏపీని టాప్ లో నిలుపుతాం

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి నారా లోకేష్ తిరుప‌తి జిల్లా : ఏపీని క్రీడా రంగంలో టాప్ లో నిలిపేందుకు కృషి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌. బుధ‌వారం తిరుపతిలోని శ్రీ శ్రీనివాస…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *