టీం ఇండియా నుంచి రింకూ సింగ్ అవుట్

Spread the love

రేపే జింబాబ్వేతో భార‌త్ నువ్వా నేనా

ముంబై : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో కీల‌క‌మైన మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతం సూపర్ – 8 లో టీమిండియా రెండు కీల‌క మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వీటిలో ఒక‌టి జింబాబ్వే కాగా మ‌రోటి వెస్టిండీస్ . ప్ర‌స్తుతం డిఫెండింగ్ ఛాంపియ‌న్ గా ఉంది భార‌త జ‌ట్టు. ఇప్పుడు డూ ఆర్ డై గా మారి పోయింది ఈ మ్యాచ్. టోర్నీలో భాగంగా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్ లో భార‌త్ ఊహించ‌ని రీతిలో బోర్లా ప‌డింది. టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన ఐదు మ్యాచ్ ల‌లో స్టార్ బ్యాట‌ర్ అభిషేక్ శ‌ర్మ నాలుగు మ్యాచ్ ల‌లో డ‌కౌట్ కాగా స‌ఫారీల‌తో జ‌రిగిన మ్యాచ్ లో బోణీ కొట్టాడు. కేవ‌లం 15 ప‌రుగులు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. శ‌ర్మకు బ‌దులు ఇప్ప‌టి వ‌ర‌కు న‌మీబియాతో జ‌రిగిన మ్యాచ్ లో 22 ర‌న్స్ చేసినా కీల‌క మ్యాచ్ లో దూరంగా పెట్టాడు కోచ్ గౌతం గంభీర్.

కాగా మ‌రో బ్యాడ్ న్యూస్ ఏమిటంటే నిన్న‌టి దాకా కీల‌కంగా మారిన రింకూ సింగ్ అనారోగ్యం పాల‌వ‌డంతో త‌న‌ను జింబాబ్వే తో జ‌రిగే మ్యాచ్ లో త‌ప్పించారు. తాజాగా క్రికెట్ వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం మేర‌కు 11 మందితో కూడిన జ‌ట్టు ఇలా ఉంది. అభిషేక్ శ‌ర్మ‌, సంజూ శాంస‌న్ , ఇషాన్ కిష‌న్ , సూర్య కుమార్ యాద‌వ్, తిల‌క్ వ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా, వాషింగ్ట‌న్ సుంద‌ర్ , అర్ష్ దీప్ సింగ్ , జ‌స్ప్రీత్ బుమ్రా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఆడ‌నున్నారు.

  • Related Posts

    ఐపీఎల్ లో హ్యాట్రిక్ కొట్టాల‌ని ఉంది : విరాట్ కోహ్లీ

    Spread the love

    Spread the loveఇప్ప‌టికే ఆర్సీబీ రెండు సార్లు విజేత‌గా నిలిచింది అహ్మ‌దాబాద్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ టైటిల్ విజేత‌గా నిలిచింది ర‌జ‌త్ పాటిదార్ నాయ‌క‌త్వంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు. గుజ‌రాత్ రాజ‌ధాని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన ఫైన‌ల్ మ్యాచ్…

    శుభ్‌మన్ గిల్ పై భ‌గ్గుమ‌న్న వీరేంద్ర సెహ్వాగ్

    Spread the love

    Spread the loveబాధ్య‌తా రాహిత్యంత కూడుకున్న ఆట ఇది ముంబై : ప్ర‌ముఖ క్రికెట‌ర్ , కామెంటేట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఇంత కీలకమైన IPL మ్యాచ్‌లో, అది కూడా ఒక ఫైనల్‌లో, శుభ్‌మన్ గిల్ నుండి మీరు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *