ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టుకు హాజ‌రైన సీఎం

Spread the love

కోవిడ్ స‌మ‌యంలో రూల్స్ పాటించ‌ని రేవంత్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ లోని నాంప‌ల్లి ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టుకు హాజ‌ర‌య్యారు. 2021లో కోవిడ్ నియమాలను పాటించకుండా పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. 2019లో హుజుర్ నగర్ బై ఎలక్షన్లో అభ్యర్థి తరపున 40 కార్లు, డీజే సౌండ్స్‌తో ర్యాలీ చేప‌ట్టారు. అప్పటి ఎంపీలుగా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు. దీంతో ఈసీ రూల్స్ కు విరుద్దంగా వీరు వ్య‌వ‌హ‌రించారంటూ ఎన్నిక‌ల సంఘం అధికారులు సీఎంపై, ఇత‌రుల‌పై ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు అక్క‌డి పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ఈ కేసుల‌కు సంబంధించి ఇవాళ విచార‌ణ చేప‌ట్టింది కోర్టు. ఇందులో భాగంగా త‌ను ఒక‌ప్పుడు ఎంపీగా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం సీఎం హోదాలో ఉన్నారు రేవంత్ రెడ్డి. భారీ భ‌ద్ర‌త న‌డుమ నాంప‌ల్లి ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టుకు హాజ‌ర‌య్యారు. ఈ కేసుకు సంబంధించి జ‌డ్జి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు సీఎంను ఉద్దేశించి. కోర్టులో విచార‌ణ అనంత‌రం సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాను చ‌ట్టానికి లోబ‌డి ఉండాల‌ని కోరుకుంటాన‌ని, అలాగే వ్య‌వ‌హ‌రిస్తాన‌ని తెలిపాడు. కేసులో భాగంగా విచార‌ణకు సంబంధించి హాజ‌రైన‌ట్లు తెలిపారు సీఎం.

  • Related Posts

    గ్లోబల్ హార్టీకల్చర్ హబ్ గా రాయ‌ల‌సీమ‌

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ మేరకు రాయలసీమను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.…

    క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

    Spread the love

    Spread the loveబాధిత కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని భరోసా అమ‌రావ‌తి : కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటన క్షతగాత్రులను పరామర్శించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. కాలిన గాయాలతో ఉన్న బాధితులను చూసి చలించి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *