newsseals.com
News

ఇరాన్ సుప్రీం క‌మాండ‌ర్ ఖ‌మేనీ ఇక లేరు

VijayaBhaskar March 1, 2026
newsseals-KhameniKilled
Spread the love

త‌ను ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఖ‌తం

ఇరాన్ : ఇరాన్ ,ఇజ్రాయెల్ దేశాల మ‌ధ్య కొన‌సాగుతున్న వైరం తారా స్థాయికి చేరుకుంది. దీని ప్ర‌భావం ప్రపంచ మార్కెట్ పై ప‌డింది. గ‌త కొంత కాలంగా ఉప్పు నిప్పు లాగా ఉంటూ వ‌చ్చిన ఇజ్రాయెల్, అమెరికా క‌లిసి ఏకంగా త‌మ‌కు అడ్డంగా ఉన్న ఇరాన్ సుప్రీం క‌మాండ‌ర్ ఇన్ చీఫ్ ఆయ‌తుల్లా ఖ‌మేనీని ల‌క్ష్యంగా చేసుకుని దాడులు చేప‌ట్టారు. ఈ మిస్సైల్స్ దాడుల్లో ఖ‌మేనీ ఖ‌తం అయ్యాడు. ఈ విష‌యాన్ని అధికారికంగా ఇరాన్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆయ‌న‌కు నివాళిగా 40 రోజుల పాటు సంతాప దినాలు నిర్వ‌హించాల‌ని తెలిపింది. ఇదిలా ఉండ‌గా ఇరాన్ కు పెద్ద దిక్కుగా ఉంటూ వ‌చ్చాడు ఖ‌మేనీ. త‌నను పూర్తిగా స‌క్సెస్ ఫుల్ గా నిర్మూలించామ‌ని ప్ర‌క‌టించారు స్వ‌యంగా అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న స్వంత సోష‌ల్ మీడియా ట్రూత్ సోష‌ల్ లో స్పందించాడు.

అయితే ట్రంప్ పోస్ట్ చేసిన వెంటనే ఇరాన్ సుప్రీం లీడర్ కు సంబంధించిన ఎక్స్ ఖాతా ట్రంప్ వాదనపై సందేహాలను లేవనెత్తుతూ ఒక రహస్య సందేశాన్ని పోస్ట్ చేసింది. పర్షియన్ భాషలో వ్రాసిన పోస్ట్ ఇలా ఉంది. అత‌నికి శాంతి క‌లుగు గాక అని పేర్కొంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి ఆపరేషన్ దశాబ్దాలుగా ఇరాన్ నుండి వస్తున్న ముప్పును అంతం చేయడం, అది అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయలేక పోవడాన్ని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ట్రంప్. నిఘా , ట్రాకింగ్ వ్యవస్థలు ఖమేనీ ఎక్కడ ఉన్నారో పర్యవేక్షించాయని, ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్‌లో రాశారు. అతను లేదా అతనితో పాటు చంపబడిన ఇతర నాయకులు చేయగలిగేది ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు.