డిజిటల్ సెన్సస్ 2027 కోసం సన్నాహాలు

Spread the love

తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీక్ష‌

హైద‌రాబాద్ : ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తో పాటు సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ తెలంగాణ భారతి హోళికేరితో కలిసి రాబోయే సెన్సస్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాల గురించి జిల్లా కలెక్టర్లకు వివరించారు. మొదటి దశ – హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ – మే 11 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయని వెల్ల‌డించారు.

సెన్సస్ 2027 భారతదేశంలో మొట్ట మొదటి పూర్తి డిజిటల్ సెన్సస్, ఇది రియల్-టైమ్, ఖచ్చితమైన , పారదర్శక డేటా సంగ్రహణను నిర్ధారించే ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా నిర్వహించ బడుతుందని అన్నారు సీఎస్ రామ‌కృష్ణ రావు. HLO కి 15 రోజుల ముందు స్వీయ-గణన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

మారుమూల, గిరిజన , దుర్బల ప్రాంతాలతో సహా – పూర్తి కవరేజీని నిర్ధారించాలని, గణనదారులు , పర్యవేక్షకులకు నిర్మాణాత్మక శిక్షణపై దృష్టి పెట్టాలని కలెక్టర్లను ఆదేశించారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ప్రధాన కార్యదర్శులు రాహుల్ బొజ్జా, సందీప్ కుమార్ సుల్తానియా, ప్రియాంక, సీనియర్ అధికారులు హాజరయ్యారు.

  • Related Posts

    గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం

    Spread the love

    Spread the loveఅంద‌జేస్తామ‌న్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని గ్రామాల స‌ర్వతోముఖాభివృద్దికి సంపూర్ణ స‌హ‌కారం అంద‌జేస్తామ‌ని అన్నారు. ఈ సంద‌ర్బంగా అన్ని ర‌కాలుగా స‌హాయ స‌హ‌కారాలు…

    భోగాపురం ఎయిర్ పోర్టు పురోగ‌తిపై స‌మీక్ష‌

    Spread the love

    Spread the loveకీల‌క సూచ‌న‌లు చేసిన రామ్మోహ‌న్ నాయుడు అమ‌రావ‌తి : కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు. ఆయ‌న విజయవాడ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ నిర్మాణం, భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం పురోగతిపై స్టేక్‌హోల్డర్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *