రాష్ట్ర ప్రణాళిక నోడల్ ఏజెన్సీగా ప్లాన్
హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం నిర్వహించనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని అయిదు దశల్లో నిర్వహించడానికి వీలుగా కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను వినియోగించనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన అన్ని శాఖల కార్యదర్శులు, కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాచరణపై సమగ్రంగా దిశా నిర్దేశం చేశారు.
5 దశల్లో కార్యాచరణ ఉంటుందన్నారు. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమాలు, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు, మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమాలు, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరపాలని అన్నారు. ఇందులో భాగంగా
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత. ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ , ఆరోగ్యం , అరైవ్ – అలైవ్ , సంక్షేమం, పిల్లల భద్రత – డ్రగ్స్‌కు అడ్డుకట్ట , రైతు సంక్షేమం – వ్యవసాయం, విద్య ,యువత – క్రీడలు, మహిళలు, పర్యావరణంపై ఉంటుందన్నారు.
మార్చి 6న అన్ని ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. 99 రోజుల్లో శాఖల వారీగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటయాని తెలిపారు.





