విష ప్ర‌చారంపై కోర్టు గ్యాగ్ ఆర్డ‌ర్ జారీ

Spread the love

స్ప‌ష్టం చేసిన టీటీడీ చైర్మ‌న్ నాయుడు

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) చైర్మ‌న్ బీఆర్ నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న ఈ మేర‌కు అధికారికంగా త‌న‌పై జ‌రుగుతున్న విష ప్ర‌చారం ప‌ట్ల స్పందించారు. టీటీడీ ఛైర్మన్‌గా త‌న‌ పై జరుగుతున్న విష ప్రచారంపై హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేయడం జరిగిందని తెలిపారు. నాపై ఆధారరహిత, దుష్ప్రచార కథనాలను ఇకపై ప్రసారం లేదా ప్రచారం చేయకూడదని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు టీటీడీ చైర్మ‌న్ . ఇప్పటికే ప్రచురితమైన కథనాలను తక్షణమే తొలగించాలని కూడా పేర్కొందని స్ప‌ష్టం చేశారు.

అలాగే గూగుల్, ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లకు సంబంధిత కంటెంట్‌ను డౌన్ చేయాలని ఆదేశాలు జారీ సింద‌న్నారు బీఆర్ నాయుడు. తిరుమల ప్రతిష్టను దెబ్బ తీయాలనే కుట్రలో భాగంగా, ఏఐ, మార్ఫింగ్ వీడియోల ద్వారా నాపై దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని హెచ్చ‌రించారు . సత్యం చివరకు గెలుస్తుందని, ధర్మం వైపు నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు బీఆర్ నాయుడు.

  • Related Posts

    శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నం ప్రారంభం

    Spread the love

    Spread the loveముగిసిన చంద్ర గ్ర‌హ‌ణం భ‌క్తులు క్యూ తిరుమల : శ్రీ‌వారి ఆల‌యంలో రాత్రి 8 గంట‌ల నుండి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంది. మధ్యాహ్నం 3.26 నుండి సాయంత్రం 6.47 గంట‌ల వ‌ర‌కు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ముందుగా…

    శ్రీ‌వారి దివ్య క్షేత్రానికి రూ. 14.25 కోట్లు కేటాయింపు

    Spread the love

    Spread the loveవెల్ల‌డించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) చైర్మ‌న్ బీఆర్ నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పాల‌క మండ‌లి స‌మావేశంలో ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. నాయుడు మీడియాతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *