ప్రజా భవన్ లో కీలక సమావేశం
హైదరాబాద్ : రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో హైదరాబాద్ జిల్లా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ పై ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్ , జీహెచ్ ఎంసీ కమిషనర్,హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అధికారులతో , సహచర మంత్రి అజారుద్దీన్ గారి తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జిల్లాలో మార్చ్ 6 నుండి జూన్12 వరకు జరగనున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ లో చేయాల్సిన అంశాల పై దిశా నిర్దేశం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.
99 రోజుల ప్రణాళిక లో బాగంగా హైదరాబాద్ జిల్లాలో పరిసరాల పరిశుభ్రత , ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళ పరిష్కరణ, ఆరోగ్యం ,సురక్షితంగా చేరుకోవడం భద్రత, సంక్షేమం ,పిల్లల భద్రత, రక్షణ డ్రగ్స్ కి నో ,విద్య, యువత , క్రీడలు , మహిళలు , పర్యావరణం అంశాలపై మండల, నియోజకవర్గ జిల్లా స్థాయి అంశాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇదిలా ఉండగా తమ ప్రజా ప్రభుత్వం బడుగు, బలహీన, పేద ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తోందని చెప్పారు. అందుకే ఇటీవల రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని మెజారిటీ ఇచ్చారని , వారికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు.





