సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ ..?

VijayaBhaskar · March 7, 2026
Spread the love

జోరుగా క్రికెట్ వ‌ర్గాల‌లో చ‌ర్చ

హైద‌రాబాద్ : ప్ర‌పంచ క్రికెట్ లోని పొట్టి ఫార్మాట్ లో అత్యంత విజ‌య‌వంత‌మైన స్కిప్ప‌ర్ గా పేరు పొందాడు ముంబైకి చెందిన సూర్య భాయ్ అలియాస్ సూర్య కుమార్ యాద‌వ్. త‌ను అద్భుత‌మైన బ్యాట‌ర్ అంతే కాదు స‌మ‌యోచిత‌మైన కెప్టెన్ కూడా. తాజాగా త‌న గురించి ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ప్ర‌స్తుతం ఇండియా, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ ) టి20 టోర్న‌మెంట్ ఆఖ‌రిద‌ని , ఆ త‌ర్వాత త‌ను త‌ప్పుకుంటాడ‌ని పెద్ద ఎత్తున క‌థ‌నాలు జాతీయ స్థాయి మీడియాలో ప్ర‌సారం అవుతున్నాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ T20 WC తర్వాత సూర్య కుమార్ యాద‌వ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. టెస్ట్ క్రికెట్ ఆడడు, ప్రస్తుత లైనప్‌లో అతని కంటే ముందు చాలా మంది ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ ఉన్నందున అతనికి వ‌న్డే జట్టులో స్థానం సంపాదించడం కష్టంగా మారింది.వయస్సుతో పాటు అతని టి20 బ్యాటింగ్ ఫామ్ కూడా పేల‌వంగా ఉండ‌డంతో ఈ T20 ప్రపంచ కప్ తర్వాత త‌ను రిటైర్మెంట్ తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇది తదుపరి సీజన్ కోసం యువ ఆటగాళ్లను జట్టులోకి చేర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది, శ్రేయాస్ అయ్యర్ వంటి ఆటగాళ్ళు ఇప్పటికే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి, కెప్టెన్సీ ఆధారంగా మాత్రమే ఎవరూ ఆడటానికి BCCI అనుకూలంగా లేక పోవ‌డం గ‌మ‌నార్హం.