గూగుల్ సీఈఓ వేత‌నం రూ. 6,300 కోట్లు

Spread the love

ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జీతం సుంద‌ర్ కు

అమెరికా : ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జ కంపెనీ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫా బెట్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌మ కంపెనీకి చెందిన ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారిగా ప‌ని చేస్తున్న ప్ర‌వాస భార‌తీయుడైన సుంద‌ర్ పిచాయ్ కు తీపి క‌బురు చెప్పింది. త‌న వేత‌నాన్ని పెంచుతున్న‌ట్లు, ఈ మేర‌కు బోర్డు ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపిన‌ట్లు ప్ర‌క‌టించింది. విచిత్రం ఏమిటంటే సుంద‌ర్ మొత్తం వేత‌నం అక్ష‌రాలా రూ. 6,300 కోట్లు. ఇది న‌మ్మ‌శ‌క్యం కాని విష‌యం. కానీ ఇది వాస్త‌వం, నిజం కూడా. ఇక సుంద‌ర్ స్వ‌స్థ‌లం త‌మిళ‌నాడు రాష్ట్రం. చెన్నైలో చ‌దివాడు.

త‌ను టీవీ కూడా లేని ఇంట్లో పుట్టాడు. మొదటిసారి గా కంప్యూటర్ ను ఐఐటి ఖరగపూర్ లో చూసాడు. ఆ త‌ర్వాత త‌ను గూగుల్ లో చేరాడు. ఆండ్రాయిడ్ ను త‌యారు చేయ‌డంలో సుంద‌ర్ పిచాయ్ కీల‌క పాత్ర పోషించాడు. దీంతో యాజ‌మాన్యం త‌న‌కు సీఈఓగా బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఓ వైపు ఏఐ డామినేట్ చేస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా గూగుల్ ను కూడా మార్చ‌డంలో ముఖ్య భూమిక పోషించాడు సుంద‌ర్ పిచాయ్. దీంతో త‌న ప‌నితీరును మెచ్చిన గూగుల్‌ మాతృ కంపెనీ ఆల్ఫాబెట్‌ పిచాయ్‌ వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రానున్న మూడేళ్ల కాలానికి ఆయన 692 మిలియన్ డాలర్లు (రూ.6,300 కోట్లకు పైనే) అందుకోనున్నారు.

దీంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓల్లో ఒకరిగా గుర్తింపు పొందారు సుంద‌ర్ పిచాయ్. ఏఐతో టెక్‌ ప్రపంచం వేగంగా మారుతున్న క్రమంలో పిచాయ్‌పై బలమైన నమ్మకంతో కంపెనీ ఈ వేతన పెంపును ప్రకటించడం విశేషం. త‌న ప‌నితీరుకు నిద‌ర్శ‌నం .

  • Related Posts

    సీఎంతో అడోబ్ సీఈవో శంత‌ను నారాయ‌ణ‌తో భేటీ

    Spread the love

    Spread the loveఇద్ద‌రి మ‌ధ్య రెండు గంట‌ల‌కు పైగా కీల‌క స‌మావేశం హైద‌రాబాద్ : ప్ర‌పంచ దిగ్గ‌జ కంపెనీ అడోబ్ సీఈవో శంత‌ను నారాయ‌ణ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా ఈ ఇద్ద‌రి మ‌ధ్య…

    2025లో భారీ ఎత్తున యూపీఐ లావాదేవీలు

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై : భార‌త దేశ అత్యున్న‌త సంస్థ రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈమేర‌కు గ‌త ఏడాది 2025లో ఏకంగా కోట్లాది రూపాయ‌ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *