క‌ళ్యాణ మండ‌పం ఏర్పాటుకు స‌హ‌క‌రిస్తా

VijayaBhaskar · March 8, 2026
Spread the love

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఎంపీ డీకే అరుణ రెడ్డి

నారాయ‌ణ‌పేట జిల్లా : మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎంపీ డీకే అరుణ భ‌ర‌త సింహా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరడగం గ్రామంలో శ్రీ సిద్ధ లింగేశ్వర పచ్చిమాద్రి సంస్థాన విరక్త మఠం మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తేరు ఊరేగింపు, మహా రథోత్సవాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం శ్రీ సిద్ధ లింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రతి సంవత్సరం మాదిరి ఈ ఏడాది కూడా పంచమ సిద్దేశ్వర స్వామి వారు పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తున్నారు, కళ్యాణాలు చేస్తున్నారని ప్ర‌శంస‌లు కురిపించారు డీకే భ‌ర‌త సిహారెడ్డి. పేద పిల్లలకు విద్య అందిస్తున్నారని, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. ఇదిలా ఉండ‌గా భ‌క్తుల కోరిక మేర‌కు , గ్రామ‌స్థుల విన్న‌పం మేర‌కు ఇక్కడ కళ్యాణ మండపం ఏర్పాటుకు తప్పకుండా సహకరిస్తాన‌ని డీకే అరుణ భ‌ర‌త సింహారెడ్డి ప్ర‌క‌టించారు. పరమేశ్వరుడి ఆశీర్వాదాలు ఉండాలని, ప్రజలందరి కోరికలు తీరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.