ఆధ్యాత్మిక వక్త , కోచ్ జయా కిషోరి కామెంట్స్
అహ్మదాబాద్ : ప్రముఖ భారతీయ ఆధ్యాత్మిక వేత్త, శిక్షకురాలు జయా కిషోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ఇవాళ ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు వేదిక కానుంది మోదీ స్టేడియం. భారత్, న్యూజిలాండ్ జట్లు కప్ కోసం పోటీ పడనున్నాయి. ఇప్పటికే లక్షా 30 వేల టికెట్లు అమ్ముడు పోయాయి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు దేశానికి చెందిన ప్రముఖులంతా క్యూ కట్టారు అహ్మదాబాద్ కు. ఇప్పటికే అన్ని హొటళ్లు నిండి పోయాయి. ఇప్పటికే భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
గుజరాత్ సర్కార్ ఈ మ్యాచ్ నిర్వహణ కోసం కనీవిని ఎరుగని రీతిలో భారీ ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ ను తిలకించేందుకు స్వయంగా విచ్చేశారు ఆధ్యాత్మిక వేత్త జయా కిషోరి. ఈ సందర్బంగా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో జాతీయ మీడియాతో మాట్లాడారు. భారతదేశం గెలవాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నానని అని చెప్పారు. భారత ఆటగాళ్ళు అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారని ఆ నమ్మకం తనకు ఉందన్నారు. వారు గెలవాలని నేను ఆశిస్తున్నానని తెలిపారు. తాము ఎల్లప్పుడూ మా జట్టుతో నిలబడతామన్నారు, ఏది ఏమైనా కేరళ స్టార్ క్రికెటర్ సంజు సాన్సన్ చాలా బాగా ఆడుతున్నాడని కితాబు ఇచ్చారు జయా కిషోరి. ఇదే సమయంలో ప్రతి ఆటగాడు అద్భుతంగా ఆడతారని అనుకుంటున్నట్లు తెలిపారు.







