రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్లు

Spread the love

సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసిన నటి

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టి, ఏపీ డిప్యూటీ సీఎం, ప్ర‌ముఖ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచ‌ల‌నంగా మారారు. త‌న‌ను కొంద‌రు కావాల‌ని టార్గెట్ చేస్తున్నారంటూ తీవ్ర ఆవేద‌న‌కు లోన‌య్యారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లోని సైబ‌ర్ క్రైమ్ ఆఫీస్ కు వెళ్లి త‌న‌ను మాన‌సికంగా వేధింపుల‌కు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా ప్ర‌త్యేకించి సామాజిక మాధ్య‌మాల‌ (సోష‌ల్ మీడియా)లో కావాల‌ని అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే కాకుండా పూర్తిగా చెప్పుకోలేని రీతిలో అస‌భ్య‌క‌ర‌మైన కామెంట్స్ చేస్తున్నారంటూ వాపోయారు రేణు దేశాయ్.

అనుచిత కామెంట్లపై నటి సీరియస్‌గా స్పందించారు. వ్యక్తిగతంగా దూషిస్తూ కొంతమంది నెటిజన్లు హద్దులు దాటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో నాలుగు సోషల్ మీడియా అకౌంట్లపై ఆధారాలతో సహా తీసుకొని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కామెంట్ల స్క్రీన్‌షాట్లు, లింకులు సహా వివరాలను పోలీసులకు అందజేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టే అవకాశం ఉందని స‌మాచారం.

  • Related Posts

    వేణు ఎల్లమ్మ కోసం కాస్టింగ్ కాల్

    Spread the love

    Spread the loveప్ర‌తిభ క‌లిగిన క‌ళాకారుల‌కు ఛాన్స్ హైద‌రాబాద్ : టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వెండి తెరకు పరిచయం అవుతున్న చిత్రం ‘ఎల్లమ్మ’. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వేణు యెల్దండి దర్శకత్వంలో…

    స్వంత ఊరితో అనుబంధం శాశ్వ‌తం

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న స్వ‌స్థ‌లం తెలంగాణ రాష్ట్రంలో నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గం బ‌ల్మూరు మండ‌ల ప‌రిధిలోని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *