సంజు శాంస‌న్ వ‌ల్ల‌నే వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచాం

VijayaBhaskar · March 10, 2026
Spread the love

క్రిష్ణ‌మాచారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

చెన్నై : మాజీ క్రిక‌టెర్ క్రిష్ణ‌మాచారి శ్రీ‌కాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు కేర‌ళ స్టార్ ప్లేయ‌ర్ సంజు శాంస‌న్ గురించి. త‌ను ఆడ‌క పోతే ఇండియా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచి ఉండేది కాద‌న్నాడు. త‌న నుంచి ఎన్నో నేర్చుకోవ‌చ్చ‌ని పేర్కొన్నాడు. భార‌త్ గెలుపొందిన అనంత‌రం కె. శ్రీ‌కాంత్ మీడియాతో మాట్లాడాడు. ఇది ఎవ‌రూ ఊహించ‌ని అద్భుత‌మైన‌, చిర‌స్మర‌ణీయ‌మైన విజ‌యం అని పేర్కొన్నాడు. ఇలాంటి క్ష‌ణాలు అరుదుగా వ‌స్తుంటాయ‌ని తెలిపాడు. ఒకానొక ద‌శ‌లో జ‌ట్టులో స్థానం కోల్పోయి అనుకోకుండా జ‌ట్టులోకి వ‌చ్చి ఆశ్చ‌ర్య పోయేలా జ‌ట్టుకు మూల స్తంభంగా మార‌డం మామూలు విష‌యం కాద‌న్నాడు సంజు శాంస‌న్ గురించి క్రిష్ణ‌మాచారి శ్రీ‌కాంత్.

ఇక్కడ రెండు పెద్ద పాఠాలు ఉన్నాయి. ఒకటి సంజు సామ్సన్. మీరు విఫలమైనా, ఆశను వదులుకోకండి. మీ సమయం వచ్చినప్పుడు, అది మిమ్మల్ని వేరే స్థాయికి తీసుకు వెళుతుందన్నాడు. రెండు బుమ్రా గురించి.. మీరు మిమ్మల్ని ఎలా సరిదిద్దుకుంటారు, మీరు కొంచెం ఆత్మ శోధన చేసి తిరిగి రావాలి. ముఖ్యంగా సంజు అతను ఎంత మానసికంగా దృఢంగా ఉన్నాడో, అతను తిరిగి వచ్చిన విధానం అద్బుతం అంటూ కొనియాడాడు. త‌ను ఆటను మార్చుకోలేదు, కానీ మానసిక వైఖరిలో కొద్దిగా మార్పు వచ్చింద‌న్నాడు.