19న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రిలీజ్

భారీ అంచ‌నాల మ‌ధ్య రానున్న సినిమా

హైద‌రాబాద్ : దమ్మున్న ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్. ఇక మోస్ట్ పాపుల‌ర్ హీరో గా గుర్తింపు పొందాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. త‌ను ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. గ‌త కొంత కాలంగా ఎన్నిక‌లు, ఇత‌ర స‌మ‌స్య‌ల కార‌ణంగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ షూటింగ్ కొంత ఆల‌స్య‌మైంది. చివ‌ర‌కు సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. యూఏ స‌ర్టిఫికెట్ కూడా వ‌చ్చింది. ఇప్ప‌టికే ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఎస్ఎస్ థ‌మ‌న్, దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌కులు సంగీతం అందించ‌డం విశేషం.

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రంలో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది ప్ర‌ముఖ న‌టి శ్రీ‌లీల‌. త‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పోటీ ప‌డి న‌టించింది. పాట‌లో త‌ళుక్కున మెరిసింది. ఈ త‌రుణంలో తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్య‌ధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ క‌లిగి ఉన్న న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఇక ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ త‌న‌తో క‌లిసి గ‌తంలో గబ్బ‌ర్ సింగ్ మూవీ తీశాడు. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. తాజాగా ఈ ఇద్ద‌రి కాంబోలో చాన్నాళ్ల త‌ర్వాత ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది . ఈనెల 19న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది ఈ మూవీ.

  • Related Posts

    పాన్ మ‌సాలా ప్ర‌చారంపై బాలీవుడ్ న‌టుల‌కు నోటీసులు

    ముంబై : విమల్ యాలాకుల‌ ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ , టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రాథమికంగా నిషేధిత పాన్ మసాలా , పొగాకు సంబంధిత ఉత్పత్తుల…

    జై శ్రీ‌రామ్ పేరుతో దాడులు చేస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె తాజాగా హిందూ సంస్థ‌ల‌ను టార్గెట్ చేశారు. మ‌రో వివాదానికి తెర తీశారు. ప్ర‌స్తుతం దేశంలో హిందూ సంస్థ‌ల హ‌వా కొన‌సాగుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *