newsseals.com
DEVOTIONAL

శ్రీ‌ధ‌ర్ బాబుకు శార‌దా పీఠం ఉత్త‌రాధికారి ఆహ్వానం

VijayaBhaskar March 14, 2026
newsseals-Srungeri
Spread the love

రావాల‌ని కోరిన ఉత్త‌రాధికారి స్వాత్మానందేంద్ర

హైద‌రాబాద్ : విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి శ‌నివారం మ‌ర్యాద పూర్వ‌కంగా రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబును క‌లిశారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లోని
కోకాపేట శారదా పీఠంలో నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్బంగా నిర్వ‌హించే ఉగాది ఆస్థానానికి రావాల‌ని ఆహ్వానించారు. ఈ సంద‌ర్బంగా ఆహ్వాన ప‌త్రిక‌ను శ్రీ‌ధ‌ర్ బాబుకు అంద‌జేశారు. ఇదిలా ఉండ‌గా త‌మ మ‌ఠంలో చోటు చేసుకున్న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంలో కీల‌క పాత్ర పోషించినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబుకు.

ఇదే క్ర‌మంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుమ‌ల రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి . శారదా పీఠం సమస్యను వెంటనే పరిష్కరించినందుకు ఆయ‌న‌ను మ‌రిచి పోలేమ‌ని అన్నారు. ఇదే క్ర‌మంలో సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు చొరవ చూపిన మంత్రి శ్రీధర్ బాబుకు మ‌రోసారి థ్యాంక్స్ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని ఆశీర్వదించి ప్రసాదాలు అందించారు స్వాత్మానందేంద్ర స‌ర‌స్వ‌తి. ఇదిలా ఉండ‌గా ఈ స‌మావేశంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ కూడా ఉన్నారు.