newsseals.com
ENTERTAINMENT

త‌మిళ ద‌ర్శ‌కుడిపై లావ‌ణ్య త్రిపాఠి కామెంట్స్

VijayaBhaskar March 15, 2026
newsseals-LavanyaTripathi
Spread the love

త‌న ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌క సినిమా చేయ‌న‌ని చెప్పా

హైద‌రాబాద్ : న‌టి, వ‌రుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న సినీ కెరీర్ గురించి ప్ర‌స్తావించారు. ఇటీవ‌లే త‌న‌ను ల‌క్ష్యంగా చేసుకుని అనుచిత‌, అస‌భ్య వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదే క్ర‌మంలో సైబ‌ర్ క్రైమ్ కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ త‌రుణంలో ఓ మీడియాతో చిట్ చాట్ సంద‌ర్బంగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌కు సినిమా ప‌రంగా ఎదురైన అనుభ‌వం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. త‌ను త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఓ ద‌ర్శ‌కుడి వ్య‌వ‌హారాన్ని తెలిపారు.

తాను ఒకానొక సమయంలో ఒక తమిళ సినిమా చేయాల్సి వచ్చింద‌న్నారు లావ‌ణ్య త్రిపాఠి. కానీ ఆ దర్శకుడి విషయంలో ఏదో సరిగా లేదని, నాకు అక్కడ సౌకర్యంగా అనిపించ లేదని అనిపించింద‌ని వెల్ల‌డించింది. దీంతో తాను ఆ సినిమాకు ప‌ని చేయ‌డం లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టాన‌ని, ముఖం మీద‌నే చెప్పాన‌ని తెలిపింది. దీంతో దీనిని త‌ట్టుకోలేక ఆ తర్వాత, వారు నా గురించి వార్తా పత్రికల్లో, మీడియాలో తప్పుడు కథనాలను ప్రచురించడం మొదలు పెట్టారని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు లావ‌ణ్య త్రిపాఠి.