త‌ప్పు చేసిన వారికి చంద్ర‌బాబు అండ‌దండ‌లు

VijayaBhaskar · March 17, 2026
Spread the love

నిప్పులు చెరిగిన మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

అమరావ‌తి : ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును ఏకి పారేశారు. మంగ‌ళ‌వారం జ‌గ‌న్ రెడ్డి మంగ‌ళ‌గిరి లోని ప్ర‌ధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక లా అండ్ ఆర్డ‌ర్ గాడి త‌ప్పింద‌న్నారు. నేరాలు, ఘోరాలు కొన‌సాగుతూనే ఉన్నాయ‌ని, ప్ర‌భుత్వం మొద్దు నిద్ర పోతోంద‌ని మండిప‌డ్డారు. అస‌లు రాష్ట్రంలో పాల‌న అనేది ఉందా , ప్ర‌భుత్వం ప‌ని చేస్తోందా అన్న అనుమానం క‌లుగుతోంద‌ని పేర్కొన్నారు జ‌గ‌న్ రెడ్డి. విచిత్రం ఏమిటంటే పైకేమో డ్ర‌గ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్న చంద్ర‌బాబు త‌న పార్టీకి చెందిన వారు డ్ర‌గ్స్ లో ప‌ట్టు ప‌డితే ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు.

డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ పట్టుబడ్డాడు.. పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ పుట్టానే.. పుట్టా మహేష్‌తో మొదలై, పుట్టా మహేష్‌తో ఆగిపోలేదు.. ఇలాంటి వాటిపట్ల సీఎం చంద్రబాబు వ్యవరించిన తీరు అత్యంత దారుణం అని పేర్కొన్నారు జ‌గ‌న్ రెడ్డి.. తప్పు చేసిన వారిపట్ల ఇప్ప‌టి వ‌ర‌కు చర్యలు తీసుకున్న దాఖ‌లాలు లేవ‌న్నారు.. అందుకే రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ దందాలు.. అత్యాచారాలు, మోసాలపై కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నార‌ని ఆరోపించారు. కోనేటి ఆదిమూలం మహిళపై లైంగిక దాడిచేస్తే చర్యలు ఏవీ అని నిల‌దీశారు సీఎంను.