కానిస్టేబుల్ షేక్ ఫౌజియాకు డీజీపీ అభినంద‌న‌

Spread the love

జాతీయ ఫెన్సింగ్ పోటీల్లో ర‌జ‌త ప‌త‌కం

హైద‌రాబాద్ : తెలంగాణ డీజీపీ శివధ‌ర్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ షేక్ ఫౌజియాను అభినందించారు. జమ్మూ , కాశ్మీర్‌లో జరిగిన జాతీయ ఫెన్సింగ్ ఈవెంట్‌లో రజత పతకం సాధించారు.కబడ్డీ క్లస్టర్‌లో భాగంగా 2మార్చి 7 నుండి 13 వరకు జమ్మూ , కాశ్మీర్‌లో జరిగిన ఫెన్సింగ్ ఈవెంట్‌లో పోలీస్ కానిస్టేబుల్ షేక్ ఫౌజియా జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని భువ‌న‌గిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో పీసీగా ప‌ని చేస్తున్నారు షేక్ ఫౌజియా. (పీసీ నెం. 13109. మహిళల ఫోయిల్ విభాగంలో ఫైనల్స్‌కు చేరుకుని రజత పతకం సాధించడ‌మే కాకుండా ఈ విభాగానికి ప్ర‌త్యేకంగా గుర్తింపు తెచ్చారు.

ఈ సంద‌ర్బంగా ర‌జ‌త ప‌త‌కం సాధించి రాష్ట్రానికి పేరు తీసుక వ‌చ్చినందుకు కంగ్రాట్స్ తెలిపారు డైరెక్టర్ జనరల్ శివధర్ రెడ్డి. ఫౌజియా సాధించిన ఈ ఘనతను ప్రశంసించారు. అలాగే, ఫెన్సింగ్ కోచ్ ఎస్. ఆర్. అర్జున్ అందించిన మార్గదర్శకత్వం, మద్దతును కూడా ప్ర‌స్తావించారు. ఈ విజయాన్ని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (స్పోర్ట్స్) డాక్టర్ గజరావు భూపాల్, తెలంగాణ ఏసీపీ ,స్పోర్ట్స్ ఆఫీసర్ రామారావు సమక్షంలో జరుపుకున్నారు. వారు క్రీడాకారిణిని, కోచింగ్ సిబ్బందిని అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు.

  • Related Posts

    హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ సింప్లీ సూప‌ర్

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంజు శాంస‌న్ కేర‌ళ : కేర‌ళ సూప‌ర్ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాబు. బుధ‌వారం తాను మీడియాతో మాట్లాడాడు. హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ గురించి ప్ర‌శంసించాడు. ఒక కోచ్‌గా…

    నేష‌న‌ల్ హీరోగా మారిన సంజు శాంస‌న్

    Spread the love

    Spread the loveవ‌ర‌ల్డ్ క‌ప్ లో ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ కేర‌ళ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అద్బుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. త‌ను టోర్నీలో మొద‌టి నాలుగు మ్యాచ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *