newsseals.com
SPORTS

నేష‌న‌ల్ హీరోగా మారిన సంజు శాంస‌న్

VijayaBhaskar March 18, 2026
newsseals-SanjuSamson
Spread the love

వ‌ర‌ల్డ్ క‌ప్ లో ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్

కేర‌ళ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అద్బుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. త‌ను టోర్నీలో మొద‌టి నాలుగు మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు. ఈ స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి మరో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ అనారోగ్యానికి గుర‌వ‌డంతో అనుకోకుండా శాంస‌న్ రంగంలోకి ఎంట‌ర్ అయ్యాడు. న‌మీబియాతో జ‌రిగిన మ్యాచ్ లో 22 ర‌న్స్ చేశాడు. ఆ త‌ర్వాత జింబాబ్వేతో జ‌రిగిన మ్యాచ్ లో 24 ప‌రుగులు చేసినా ఆ త‌ర్వాత కీల‌క‌మైన కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ లో దుమ్ము రేపాడు. మ్యాచ్ లో తొలి బంతి నుంచి మ్యాచ్ ఆఖ‌రి ఓవ‌ర్ దాకా త‌ను గోడ‌లా నిల‌బ‌డ్డాడు. ఏకంగా 97 ప‌రుగులు చేశాడు. సెంచ‌రీ చేసే ఛాన్స్ ఉన్న‌ప్ప‌టికీ త‌ను జ‌ట్టు కోసం ఆడాడు. సెమీ ఫైన‌ల్ కు తీసుకు వెళ్లాడు ఒంట‌రిగానే.

ముంబై వేదిక‌గా జ‌రిగిన సెమీ ఫైన‌ల్ లో ఇంగ్లండ్ జ‌ట్టుకు చుక్క‌లు చూపించాడు. త‌నే టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. కీల‌క‌మైన , అత్యంత విలువైన 89 ర‌న్స్ చేశాడు. నువ్వా నేనా అన్న రీతిలో ఈ మ్యాచ్ సాగింది. 7 ప‌రుగుల తేడాతో ఓడించింది. ఫైన‌ల్ కు చేరుకుంది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ లో మ‌రోసారి రెచ్చి పోయాడు సంజు శాంస‌న్ . ఇదే జ‌ట్టుతో స్వ‌దేశంలో జ‌రిగిన సీరీస్ లో త‌ను విఫ‌లం అయ్యాడు. కానీ ఫైన‌ల్ లో క‌సి తీరా ఆడాడు. 89 ర‌న్స్ తో విరుచుకు ప‌డ్డాడు. భారీ స్కోర్ సాధించింది. టీం ఇండియా ఏకంగా 255 ర‌న్స్ చేసింది. కానీ కీవీస్ చ‌తికిల ప‌డింది. 96 ప‌రుగుల తేడాతో ఓడి పోయంది. భార‌త్ విశ్వ విజేత‌గా నిలిచింది. ఇండియా క‌ప్ గెల‌వ‌డంలో ముఖ్య‌మైన పాత్ర పోషించాడు శాంస‌న్. 5 ఇన్నింగ్స్ లు ఆడి 321 ర‌న్స్ చేశాడు. ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు పొందాడు. ఇప్పుడు నేష‌న‌ల్ హీరోగా మారి పోయాడు.