శాంస‌న్ ను కోల్పోవ‌డం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు న‌ష్టం

Spread the love

ప్ర‌ముఖ క్రికెట‌ర్ ఫాప్ డుప్లిసెస్ షాకింగ్ కామెంట్స్

ముంబై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో , కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు ప్ర‌ముఖ క్రికెట‌ర్ ఫాఫ్ డుప్లెసిస్ . మార్చి 28వ తేదీ నుంచి ఐపీఎల్ టోర్నీ జ‌ర‌గ‌నుంది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేవ‌లం 20 మ్యాచ్ లు మాత్ర‌మే షెడ్యూల్ ను ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్బంగా సంజు శాంస‌న్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. త‌ను వ‌ర‌ల్డ్ క‌ప్ లో కేవ‌లం 5 ఇన్నింగ్స్ లు మాత్ర‌మే ఆడాడు. అత్య‌ధికంగా ప‌రుగులు చేశాడు భార‌త జ‌ట్టు త‌ర‌పు నుంచి. త‌ను 321 ప‌రుగుల‌తో ఏకంగా ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ అవార్డు పొందాడు. అయితే కొన్నేళ్ల పాటు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు త‌ను ప్రాతినిధ్యం వ‌హించాడు.

కెప్టెన్ గా ఆ జ‌ట్టును ఫైన‌ల్ దాకా తీసుకు వెళ్ల‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. అయితే ఈసారి ఐపీఎల్ 2026 సీజ‌న్ లో త‌ను ఆడ‌డం లేదు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు నుంచి . త‌న‌ను ఏరికోరి చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు తీసుకుంది. ఈ సీజ‌న్ నుంచి త‌ను సీఎస్కే త‌ర‌పున ఆడ‌తాడు. దీనిపై స్పందించాడు పాఫ్ డుప్లెసిస్ . అతను కొత్త తరం ఆటగాడే అయినా, ఆ ఫ్రాంచైజీకి అతనే ముఖచిత్రంగా మారాడు. నాకు రాజస్థాన్ రాయల్స్ అనగానే సంజు సామ్సన్ గుర్తొస్తాడు. కాబట్టి, వారు ఆ ముఖచిత్రాన్ని కోల్పోవడం అభిమానులకు, ఐపీఎల్‌కు, టోర్నమెంట్‌కు చాలా పెద్ద విషయం అని నేను భావిస్తున్నాను, ఎందుకంటే శాంస‌న్ అక్కడ అంత పెద్ద పాత్ర పోషించాడని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

  • Related Posts

    సంజు శాంస‌న్ స్థానాన్ని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేరు

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన రాజ‌స్తాన్ రాయల్స్ కెప్టెన్ ఢిల్లీ : ఐపీఎల్ 2026 లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు నూత‌న కెప్టెన్ గా ఎంపికైన‌ రియాన్ ప‌రాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఏడాది ప్రీ-సీజన్ సంద‌ర్భంగా జ‌రిగిన‌…

    ఎంఎస్ ధోనీకి స‌రైన వార‌సుడు శాంస‌న్

    Spread the love

    Spread the loveమాజీ క్రికెట‌ర్లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు సంజుపై చెన్నై : భార‌త క్రికెట్ జ‌ట్టులో లివింగ్ లెజెండ్ గా పేరు పొందిన క్రికెట‌ర్ జార్ఖండ్ డైన‌మెట్ గా పిలుచుకునే మ‌హేంద్ర సింగ్ ధోనీకి అస‌లు, సిస‌లైన వారసుడు ఎవ‌రు అనే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *