అన్న ప్ర‌సాదానికి రూ. 44 ల‌క్ష‌ల విరాళం

Spread the love

భ‌క్తుల‌కు స్వ‌యంగా వడ్డించిన భువ‌నేశ్వ‌రి

తిరుమ‌ల : కోట్లాది మందికి ఇష్ట దైవంగా పేరు పొందిన తిరుమ‌ల పుణ్య క్షేత్రాన్ని శ‌నివారం సంద‌ర్శించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కుటుంబం. బాబుతో పాటు కొడుకు, మంత్రి నారా లోకేష్‌, హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ నారా బ్రాహ్మ‌ణి, చైర్మ‌న్ నారా భువ‌నేశ్వ‌రి. శ‌నివారం త‌మ మ‌నవ‌డు నారా దేవాన్ష్ పుట్టిన రోజు కావ‌డంతో ప్ర‌తి ఏటా ద‌ర్శించు కోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఇవాళ స్వామి వారిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు.

దేవాన్ష్ పుట్టిన రోజు సంద‌ర్బంగ‌గా తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకుని ఆ స్వామి ఆశీర్వాదాలను అందుకున్నారు చంద్రబాబు, కుటుంబీకులు. కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఈసారి కూడా అన్నదానం కోసం ఒక రోజుకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను శ్రీవారి అన్నదాన ట్రస్టుకు విరాళంగా అందించారు. దేవాన్ష్ తో సహా కుటుంబ సభ్యులందరూ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదాన్ని స్వయంగా వడ్డించారు. భ‌క్తుల‌కు త‌న చేతితో అన్నం వ‌డ్డించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు నారా భువ‌నేశ్వ‌రి .

  • Related Posts

    జూలై 31లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి

    Spread the love

    Spread the loveఆదేశించిన టిటిడి జేఈవో డా. ఎ. శరత్ తిరుపతి : తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను జూలై 31వ తేదీ లోపు పూర్తి చేయాలని టిటిడి జేఈవో (వైద్యం –…

    మే 18న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుప‌తి : శ్రీ గోవింద రాజ స్వామి వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ఈనెల 23 నుండి ప్రారంభం కానున్నాయి.బ్రహ్మోత్సవాల సందర్భంగా మే 18వ తేదీన ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. తెల్లవారుజామున…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *