ప్ర‌జా ప్ర‌యోజ‌న‌మే లక్ష్యంగా ప‌ని చేయాలి

Spread the love

హైడ్రా క‌మిష‌న‌ర్ దిశానిర్దేశం ఏవీ రంగ‌నాథ్

హైద‌రాబాద్ : ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దువుకుని గ్రూప్ – 1 ఉద్యోగాల‌కు ఎంపిక‌య్యారు. ప‌లు శాఖ‌ల్లో అధికారులుగా మీరు విధులు నిర్వ‌హించ‌నున్నారు. మీ విభాగాల్లో ప్ర‌త్యేక‌త‌ను చాటాలి. అధికారుల‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌లిగేలా మీ చ‌ర్య‌లుండాలి. మీ ప్ర‌తి చ‌ర్య పార‌ద‌ర్శ‌కంగా ఉండాలి.. ప్ర‌జాప్ర‌యోజ‌నమే ల‌క్ష్యంగా ఉండాలి. ప్ర‌జ‌ల‌కు పూర్తి అవ‌గాహ‌న ఉంటే.. ప‌రిపాల‌న సుల‌భమౌతుంది. వారి మ‌ద్ధ‌తు కూడా సంపూర్ణంగా అందుతుంది. చ‌రిత్ర‌ను ఫాలో అయి.. మీ విభాగాల్లో ఎవ‌రికి వారు కొత్త చ‌రిత్ర‌ను సృష్టించాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ అన్నారు. గ్రూప్ -1 కేడ‌ర్‌కు ఎంపికైన ఉద్యోగుల శిక్ష‌ణ కార్య‌క్ర‌మంల భాగంగా డా. మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి సంస్థ‌లో హైడ్రా క‌మిష‌న‌ర్ మాట్లాడారు. హైడ్రా కార్య‌క‌లాపాల‌ను వివ‌రించారు.

ఆదిలో హైడ్రా ఎదుర్కొన్న స‌వాళ్ల‌ను.. వాటిని అధిగ‌మించిన తీరును తెలిపారు. హైడ్రా అంటే ప్ర‌జ‌ల్లో పూర్తిగా అవ‌గాహ‌న రావ‌డంతో తాము చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు పూర్తి స్థాయి మ‌ద్ధ‌తు ల‌భిస్తోంద‌న్నారు. సామాజిక మాధ్య‌మాల్లో గ‌మ‌నిస్తే హైడ్రా అంటే ఆదిలో దాదాపు 70 శాతం నెగిటివిటీ క‌నిపించేదన్నారు. ఇప్పుడా శాతం రివ‌ర్స్ అయ్యింద‌న్నారు. 85 శాతం మంది హైడ్రా ప‌ట్ల సానుకూల దృక్ప‌థంతో ఉన్నార‌న్నారు. ఇదంతా ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా మ‌న కార్య‌క‌లాపాలు సాగించ‌డం.. గ్రౌండ్‌మీద ఫ‌లితాలు చూపించ‌డంతో సాధ్య‌మైంద‌న్నారు.

  • Related Posts

    జీవన్ రెడ్డి మా పార్టీలోకి వస్తే భుజాన మోస్తా

    Spread the love

    Spread the loveబీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజయ్ కామెంట్స్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి త‌మ పార్టీలోకి వ‌స్తానంటే సాద‌రంగా ఆహ్వానిస్తామ‌ని అన్నారు. ఎమ్మెల్యే…

    త్వ‌ర‌లో నా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తా

    Spread the love

    Spread the loveబీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ కామెంట్స్ హైద‌రాబాద్ : బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న పుట్టిన రోజు సంద‌ర్బంగా శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ త్వ‌ర‌లోనే త‌న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *