త్వ‌ర‌లో నా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తా

బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ కామెంట్స్

హైద‌రాబాద్ : బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న పుట్టిన రోజు సంద‌ర్బంగా శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ త్వ‌ర‌లోనే త‌న భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా త‌న ప్లాన్ ఉంటుంద‌న్నారు. అవమానాలు, అణిచివేతల నుంచే పెను మార్పులు వస్తాయని చెప్పారు ఎంపీ.
పదవుల కోసం పెదవులు మూసే రకం తాను కాద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ఈట‌ల రాజేంద‌ర్. మీ ఆశీర్వాదాలు వృథా కాకుండా చేస్తానన‌ని పేర్కొన్నారు.

తాను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తూ వ‌చ్చాన‌ని అన్నారు. త‌న జీవితం ఉన్నంత వ‌ర‌కు జ‌నంలోనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు ఈట‌ల రాజేంద‌ర్. ఆ రోజుల్లో నాతో ఎవరైనా పెట్టుకోవాలంటే భయపెడేవాళ్లని అన్నారు. ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుందన్నారు. తాను ఎవ‌రి ప‌ట్ల ద్వేష పూరితంగా ఉండ‌న‌ని చెప్పారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న చెందారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌క్ష సంక్షేమం కోసం తాను పాటు ప‌డ‌తాన‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *