నియమించిన మెగాస్టార్ కూతురు సుష్మిత
హైదరాబాద్ : మెగాస్టార్ కూతురు సుష్మిత కొణిదల కీలక ప్రకటన చేసింది. మెగా అభిమాన సంఘాలను సమన్వయం చేస్తూ యువశక్తిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్థాపించిన “Mega Youth Force” సంస్థకు జాతీయ కన్వీనర్ గా రాజమండ్రికి చెందిన ఏడిద బాబిని నియమించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించింది. గత ఎన్నో సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మెగా హీరోల పేర్లతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అభిమానులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ, సమన్వయం చేస్తూ ముందుకు నడిపించిన సేవలను పరిగణనలోకి తీసుకుని ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించడం జరిగిందని తెలిపారు..
ఈ సందర్భంగా ఏడిద బాబికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో “Mega Youth Force” సంస్థ మరింత బలోపేతం అవుతూ, యువతను సమాజ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే మెగా హీరోల అభిమానులను సమన్వయం చేస్తూ. యువశక్తిని కలుపుకొని రాష్ట్ర స్థాయి నుండి జిల్లా. పట్టణ, మండల స్థాయిల వరకు నూతన కమిటీలను ఏర్పాటు చేసి సంస్థను విస్తరించి బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నామని తెలిపారు.







