తెలుగుదేశం పార్టీలో క్లస్టర్లది కీలక పాత్ర

Spread the love

స్ప‌ష్టం చేసిన మంత్రి నారా లోకేష్

మంగ‌ళ‌గిరి : తెలుగుదేశం పార్టీలో క్లస్టర్లది చాలా కీలక‌మైన పాత్ర అని గుర్తు చేశారు మంత్రి నారా లోకేష్. యూనిట్, బూత్ లను సమర్థంగా నడిపించగల వ్యక్తులు మీరు. మీపై బాధ్యత ఉంది. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమీక్షించాలి. మీరు పార్టీని నడిపించాలి. అందుకే పార్టీ సిద్ధాంతాలు, విధులు, బాధ్యతలపై శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు పద్ధతి ప్రకారం నెరవేరుస్తున్నాం. సకాలంలో జీతాలు చెల్లిస్తున్నాం. 2019-24 మధ్య సామాన్య ప్రజలపై దాడి చేశారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య కలిసి హత్య చేశారు.

డాక్టర్ సుధాకర్ ను హింసించారు. తన సోదరిని వేధిస్తున్నారని ప్రశ్నించిన అమర్ నాథ్ గౌడ్ ను చంపారు. మన పార్టీకి చెందిన తోట చంద్రయ్యను హత్య చేశారు. ఇవన్నీ మనం మర్చికూడదు. ప్రజలకు వివరించి వారిలో చైతన్యం తీసుకురావాలి. తెలుగుదేశం పార్టీ సొంతిల్లు, ప్రభుత్వం కిరాయి ఇల్లు వంటింది. వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయానికి సమయం కేటాయిస్తున్నాను. ఆ వారంలో నా శాఖకు సంబంధించిన కార్యక్రమం ఉన్నా పార్టీకే ప్రాధాన్యత ఇస్తున్నా. అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రతి బూత్ లో మెజార్టీ తీసుకువస్తే 175 స్థానాల్లో విజయం సాధించవచ్చు. నాకు 91వేల మెజార్టీ వచ్చినా 8శాతం బూత్ లలో మైనస్ వచ్చింది. దీంతో ఇప్పటి నుంచే నేను కసరత్తు చేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా బలహీనంగా ఉన్న బూత్ ల బలోపేతంపై దృష్టి సారించాం. క్లస్టర్ పరిధిలో ఉన్న బలహీన బూత్ ల బలోపేతంపై మీరు దృష్టి సారించాలని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్.

  • Related Posts

    సింగ‌పూర్ ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల‌తో ప‌య్యావుల భేటీ

    Spread the love

    Spread the loveకీల‌క అంశాల‌పై విస్తృతంగా చ‌ర్చ‌లు అమ‌రావ‌తి : అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధుల బృందంతో సమావేశం అయ్యారు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ . ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత సమర్థవంతమైన, నాణ్యమైన…

    హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై స్పీకర్ సీరియ‌స్

    Spread the love

    Spread the loveచ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీఆర్ఎస్ డిమాండ్ హైద‌రాబాద్ : ప్రోటోకాల్ ను పాటించ‌డం లేద‌ని, ఒంటెద్దు పోక‌డ పోతున్నాడ‌ని, తానే సుప్రీం అని ఫీల్ అవుతున్నాడ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది బీఆర్ఎస్ పార్టీ.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *