Friday, 16 October 2026

శ్రీ‌రామ న‌వమి కోసం భారీ ఏర్పాట్లు

newsseals-Jaggareddy


భ‌క్తుల‌కు ఇబ్బంది రాకుండా చూడాలి

సంగారెడ్డి జిల్లా : రామ్ నగర్ రామ్ మందిర్ లో శ్రీరామ నవమి రోజు సీతా రాముల కళ్యాణం, దర్శనానికి క్యూ లైన్ లో నిల్చున్న వారికి తొందరగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాల‌ని అన్నారు మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి. క్యూ లైన్ లో వచ్చే వారందరికీ ఎండ తగలకుండా సీలింగ్ టెంట్ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. దర్శనం చేసుకున్న భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలు అందిస్తాం అని చెప్పారు. శ్రీరామ నవమి రోజు రామ మందిరానికి వచ్చే భక్తులకే తొలి ప్రాధాన్యం ఇస్తామ‌న్నారు.
లైన్లో వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడడానికి అందరూ కృషి చేయాలని కోరారు జ‌గ్గారెడ్డి.

శ్రీరామ నవమి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. ఏ ఒక్క భ‌క్తుడికి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూస్తున్నామ‌న్నారు. ఇదిలా ఉండ‌గా గ‌త అనుభవాలను దృష్టిలో ఉంచుకొని దర్శనం ఆలస్యం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామ‌న్నారు. అంతే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్తుల‌కు అన్న‌దానం కూడా క‌ల్పించామ‌న్నారు. ఏర్పాట్ల‌ను స్థానిక రామ్ నగర్ రామ్ మందిర్ ఆలయ కమిటీ ప‌ర్య‌వేక్షిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *