వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకు వస్తాం
విజయవాడ : ఏపీ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించి సమూల మార్పులు తీసుకు వచ్చేలా ప్రయత్నం చేస్తోంది కూటమి సర్కార్. ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సింగపూర్ ప్రతినిధలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు విజయవాడ కేంద్రంలోని తన కార్యాలయం నుంచి. సింగపూర్ లో అమలు చేస్తున్న ఆధునిక తీర అభివృద్ధి నమూనాలను రాష్ట్రంలో అనుసరించే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కోల్డ్ స్టోరేజ్ మేనేజ్‌మెంట్ పై కూడా ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఆహార ఉత్పత్తుల నిల్వ, నాణ్యత పరిరక్షణ, నష్టాలను తగ్గించే విధానాలు, ఆధునిక కోల్డ్ చైన్ వ్యవస్థలపై ఇరు పక్షాలు ప్రశ్నలు అడిగి సమాధానాలు ఇచ్చుకున్నారు.
ఈ రంగంలో సాంకేతిక సహకారం పెంపుపై చర్చించారు. ఇరు దేశాల మధ్య వ్యవసాయ రంగంలో సహకారం, జ్ఞాన మార్పిడి, పెట్టుబడుల అవకాశాలు మరింత బలోపేతం అవుతాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆధునిక వ్యవసాయ విధానాలు, సరఫరా వ్యవస్థలను మెరుగుపరచడానికి ఈ చర్చలు ఉపయోగ పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఆఫిషియో, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, సింగపూర్ ప్రతినిధులు పాల్గొన్నారు.





