ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు
ముంబై : ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ధురంధర్ -2 అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. ఆ సినిమాను చూసి తాను ఆశ్చర్యానికి లోనైనట్లు తెలిపారు. తాను కూడా ఎన్నో సినిమాలలో నటించినా ఇలాంటి మూవీ తనకు నటించేందుకు ఛాన్స్ రాలేదన్నాడు. ప్రత్యేకించి ఈ సినిమా సక్సెస్ అనేది నటీ నటులది కాదని కేవలం దర్శకుడు ఆదిత్య ధర్ కు మాత్రమే దక్కుతుందన్నాడు. ఇదిలా ఉండగా ఈ మూవీని జ్యోతి దేశ్పాండే, లోకేష్ ధర్ నిర్మించారు . ఈ మూవవీ మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనిని హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ అయ్యింది.
ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా రూ. 1365 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది. ధురంధర్ -2 మూవీ పై స్పందించాడు. సింప్లీ సూపర్ గా ఉందంటూ దర్శకుడు కితాబు ఇచ్చాడు. ఈ సినిమాను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నటుడు తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, సారా అర్జున్ కీలక పాత్రలలో నటించారు. తొలి మూవీ గత ఏడాది విడుదలైంది. ఏకంగా రూ. 1100 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ధురంధర్ -2 సీక్వెల్ గా ముందుకు వచ్చింది.







