బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. మంగళవారం తెలంగాణ భవన్ లో ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సీఎంగా వ్యవహరించడం లేదన్నారు. ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ప్రాక్సీ సీఎంగా వ్యవహరిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో రాచరిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
మేడిగడ్డలో పిల్లర్లు వాటంతట అవి కూలిపోలేదని చెప్పారు. కానీ వాటిని కుట్ర పూరితంగా కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు వాటిని ఎందుకు రిపేర్ చేయడం లేదంటూ ప్రశ్నించారు పోలవరం నుండి బనకచర్లకు నీళ్లు పోవాలంటే మేడిగడ్డ రిపేర్ అవ్వొద్దని, కావాలనే రిపేర్ చేయడం లేదని మండిపడ్డారు . ఒక ప్రాక్సీ ముఖ్యమంత్రిని చంద్రబాబు తెలంగాణలో పెట్టాడన్నారు. ఏపీ సర్కార్
యదేచ్చగా నీళ్లు తరలించుకు పోతుంటే.. తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు ఆర్ఎస్పీ. గత రెండు ఏళ్లలో ఇదే తతంగం కొనసాగుతూ వస్తోందన్నారు.





