Friday, 16 October 2026

తిరుమల శ్రీవారి స‌న్నిధిలో ఏపీ గ‌వ‌ర్న‌ర్

newsseals-APGovener

కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్నారు

తిరుమల : తిరుమల శ్రీవారిని ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ సాదరంగా అహ్వానించారు. అర్చక బృందం ఇస్తికఫాల్‌ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ద‌ర్శ‌నం అనంత‌రం రంగనాయకుల మండపంలో ఎస్.అబ్దుల్ నజీర్ కు, కుటుంబీకుల‌కు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఈవో, అదనపు ఈవోలు తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోక‌నాథం, విజివో రామ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వామి వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం ఆల‌య ప్రాంగ‌ణంలో మీడియాతో మాట్లాడారు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్. ప్ర‌తి ఏటా స్వామి వారిని ద‌ర్శించు కోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు. స్వామి వారి స‌న్నిధిలో ఉండ‌డం ఎంతో సంతోషం క‌లిగిస్తుంద‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా తెలుగు వారంతా ఎక్క‌డ ఉన్నా సంతోషంగా ఉండాల‌ని ప్రార్థించాన‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *