రోడ్ షోలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

Spread the love

కేర‌ళ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న వైనం

కేర‌ళ : సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేర‌ళ రాష్ట్రంలో ప్ర‌స్తుతం శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ముఖ్య‌మైన నాయ‌కులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా తెలంగాణ రాష్ట్రం త‌ర‌పున ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ఉన్నారు. వీరంతా శాస‌న స‌భ స‌మావేశాల‌లో హాజ‌రు కావాల్సి ఉండ‌గా వారంతా గంప గుత్త‌గా ఇప్పుడు కేర‌ళ ఎన్నిక‌ల్లో పాల్గొంటున్నారు.

ఇదిలా ఉండ‌గా కేరళం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ముట్టతార (Muttathara) రోడ్ షోలో పాల్గొన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. మతతత్వ శక్తులు కేరళంలోకి ప్రవేశించకుండా నియంత్రించాలని ఆ రాష్ట్ర ప్రజలను కోరారు. దేశంలో గ‌త 12 ఏళ్లుగా భార‌తీయ జ‌న‌తా పార్టీ కులం పేరుతో, మ‌తం పేరుతో ప్ర‌జ‌ల‌ను విడ‌దీసి ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందాల‌ని చూస్తోంద‌ని ఆరోపించారు. ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా త‌మ విలువైన ఓటు హ‌క్కును వినియోగించు కోవాల‌ని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాల‌ని కోరారు.

  • Related Posts

    ఆర్డీటీ సేవ‌ల‌కు ఇక ఆటంకాలు ఉండ‌వు

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ అనంత‌పురం జిల్లా : సామాజిక సేవ‌లో నిమ‌గ్న‌మైన ఆర్డీటీ సంస్థను అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు సింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. ఆర్.డి.టి. సంస్థ ఎఫ్.సి.ఆర్.ఎ. ను కేంద్ర ప్రభుత్వం రెన్యూవల్…

    ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నాం : సీఎం

    Spread the love

    Spread the loveనేత‌న్న‌ల‌కు ఉచిత విద్యుత్ ప‌థ‌కం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌డం జ‌రిగింద‌న్నారు. హామీగా కాకుండా బాధ్య‌త‌గా త‌మ కూట‌మి స‌ర్కార్ భావించింద‌ని పేర్కొన్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *