Friday, 16 October 2026

ఆర్డీటీ సేవ‌ల‌కు ఇక ఆటంకాలు ఉండ‌వు

newsseals-BandaruSravaniSree

స్ప‌ష్టం చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ

అనంత‌పురం జిల్లా : సామాజిక సేవ‌లో నిమ‌గ్న‌మైన ఆర్డీటీ సంస్థను అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు సింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. ఆర్.డి.టి. సంస్థ ఎఫ్.సి.ఆర్.ఎ. ను కేంద్ర ప్రభుత్వం రెన్యూవల్ చేసిన నేపథ్యంలో సంస్థ కార్యాలయంలో ఆర్.డి.టి. ప్రోగ్రామ్ డైరెక్టర్ మంచ్ ఫెర్రర్ ని, ఆర్.డి.టి. మహిళా సాధికారత అధ్యక్షులు విష ఫెర్రర్ ని ఎడిసిసి బ్యాంకు చైర్మన్ కేశవ రెడ్డి , పుట్లూరు మండల కన్వీనర్ శ్రీనివాసులు, అనంతపురం జిల్లా టీడీపీ నాయకులు శ్రీధర్ బాబు ,జిసి బాబు , రమణ క్యాటరింగ్స్ యజమాని కొప్పల వెంకటరమణ తో కలిసి మర్యాద పూర్వకంగా క‌లిశారు.

ఈ సందర్భంగా వారికి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు బండారు శ్రావ‌ణి శ్రీ‌.
ఆర్డిటి సంస్థ సేవలు కలకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. అలాగే మహనీయుడు, దివంగ‌త‌ విన్సెంట్ ఫెర్రర్ ఆశయాల బాటలో నడుస్తున్న మంచ్ ఫెర్రరీకి నా కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాని పేర్కొన్నారు. ఎంతో వెనకబడి ఉన్న అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ చేపట్టిన కార్యక్రమాలు సేవలు చాలా అమోఘమైనవి అని ప్ర‌శంసించారు, ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ,బీసీ లకు విద్య, ఆర్థిక అభివృద్ధిలో అందించిన సేవలు గొప్పవన్నారు. అలాగే కుల మతాలకు సంబంధం లేకుండా ప్రజలందరికీ ఆర్డిటి ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు అందజేయడం పట్ల జిల్లా వాసుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *