కొండాపూర్ పబ్ దాడిలో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్

VijayaBhaskar · April 3, 2026
Spread the love

మొత్తం 64 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన పోలీసులు

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో మ‌రో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. న‌గ‌రంలోని కొండాపూర్ ప‌బ్ లో రాత్రి పోలీసులు ఆక‌స్మిక దాడి చేశారు. మొత్తం 64 మందికి ప‌రీక్ష‌లు చేప‌ట్టారు. ఇందులో ఎనిమిది మందికి డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు డ్ర‌గ్స్ ప‌రీక్ష‌ల్లో తేలింది. పోలీసులు డ్రగ్స్ నియంత్రణకు కృషి చేసే ‘ఎలైట్ యాక్షన్ గ్రూప్ మూకుమ్మ‌డి దాడికి పాల్ప‌డింది. ఆ పబ్‌లో ‘బ్లాక్ కాఫీ’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ పార్టీ కోసం నైజీరియాకు చెందిన ఒక డీజేని ప్రత్యేకంగా రప్పించారు. ఈ కార్యక్రమానికి నైజీరియా వ్యక్తి DJగా వ్యవహరిస్తున్నారన్న సమాచారం మేరకు ఈగ‌ల్ సిబ్బంది ఉన్న‌ట్టుండి ప‌బ్ పై దాడికి పాల్ప‌డ్డారు.

ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, వారు అక్కడ ఉన్న 64 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఎనిమిది మందికి డ్రగ్స్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. పోలీసులు ఆ ఎనిమిది మంది వ్యక్తుల నుండి రక్త నమూనాలను సేకరించి, విశ్లేషణ నిమిత్తం పంపారు. తదుపరి చర్యలు చేపట్టేందుకు పోలీసులు ఆ నివేదికల కోసం వేచి చూస్తున్నారు. డ్రగ్స్ సరఫరా చేసిన వారిని గుర్తించి పట్టుకునేందుకు, పోలీసులు డ్రగ్స్ సేవించిన వారి నుండి మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. డ్రగ్స్ సరఫరాదారులను గుర్తించేందుకు, పబ్‌లో అమర్చిన నిఘా కెమెరాల (CCTV) దృశ్యాలను కూడా వారు పరిశీలిస్తున్నారు. ఈ దాడుల నేప‌థ్యం క‌ల‌క‌లం రేపింది.