వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌కు తెలంగాణ స‌ర్కార్ చేయూత

VijayaBhaskar · April 3, 2026
Spread the love

స్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ ర‌డ్డి

హైద‌రాబాద్ : వ‌స్త్ర ప‌రిశ్ర‌మ రంగానికి తెలంగాణ ప్ర‌జా ప్ర‌భుత్వం ఇతోధికంగా చేయూతను ఇచ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. పెట్టుబడులను ఆకర్షించడానికి పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు, త్వరితగతిన అనుమతులు, భూమి, విద్యుత్, నీటి విషయంలో మద్దతు అందిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. అంతే కాకుండా 2047 నాటికి రాష్ట్రాన్ని దక్షిణాసియా వస్త్ర రాజధానిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను పునరుద్ఘాటించారు మ‌రోసారి.

2034 నాటికి రాష్ట్రం 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు. సుస్థిరత ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌లను అభివృద్ధి చేయడానికి. ముఖ్యంగా మహిళలకు నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రణాళికలను ప్రకటించారు. ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ, తెలంగాణ పటిష్టమైన పర్యావరణ వ్యవస్థను, నైపుణ్యం కలిగిన మానవ వనరులను , ప్రగతిశీల విధానాల చట్రాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు; ప్రపంచ స్థాయిలో పోటీపడగలిగే వస్త్ర పరిశ్రమను నిర్మించడంలో భాగస్వాములు కావాల‌ని సీఎం పిలుపునిచ్చారు.