Friday, 16 October 2026

నకిలీ సర్టిఫికెట్లతో జాబ్స్ 69 మందిపై వేటు

newsseals-APSPDCL

ఏపీఎస్పీడీసీఎల్ లో న‌కిలీ ధ్రువ‌ప‌త్రాల బాగోతం

అమ‌రావ‌తి : ఏపీఎస్పీడీసీఎల్ లో న‌కిలీ స‌ర్టిఫికెట్ల‌తో జాబ్స్ పొందిన వారిపై వేటు వేయ‌డం క‌ల‌క‌లం రేపింది రాష్ట్ర వ్యాప్తంగా. నకిలీ ధ్రువపత్రాలతో య‌ధేశ్చ‌గా షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు పొందారు. ఆపై విధులు నిర్వ‌హిస్తూ వ‌చ్చారు. తాజాగా ఏపీసీపీడీసీఎల్ సీఎండీగా కొలువు తీరిన త‌ర్వాత ఈ మొత్తం బాగోతంపై సీరియ‌స్ అయ్యారు. ఆ మేర‌కు విచార‌ణ‌కు ఆదేశించారు. దీంతో సుదీర్ఘ విచార‌ణ‌లో న‌కిలీ ధ్రువ‌ప‌త్రాల‌తో 69 మంది షిఫ్ట్ ఆప‌రేట‌ర్ పోస్టులు పొందిన‌ట్లు తేలింది. దీంతో శుక్ర‌వారం వారంద‌రిపై చర్యలు చేపట్టారు.

ఐటీఐ (ఎలక్ట్రిషియన్) చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారు. ఆపై ఉద్యోగాలు పొందినట్లు విచారణలో తేలడం క‌ల‌క‌లం రేపింది. దీంతో వారిని తొలగించాలని సంబంధిత ఏజెన్సీలకు సీఎండీ శివశంకర్ లోతేటి నోటీసులు జారీ చేశారు. వారిలో జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి. కడప రీజియ‌న్ లో 38 మంది న‌కిలీ స‌ర్టిఫికెట్ల‌తో జాబ్స్ పొందిన‌ట్లు తేలింది. కర్నూలులో 16 మంది, తిరుపతిలో 3, చిత్తూరులో 4, నెల్లూరులో 4, అనంతపురం జిల్లాలో 3, అన్నమయ్య జిల్లాలో ఒకరు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *