కొహెడ ఫ్రూట్ మార్కెట్ భూమిపై క‌న్నేసిన సీఎం

ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో సీఎంగా కొలువు తీరాక త‌ను అస‌లు రూపాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాడ‌ని అన్నారు. ప్ర‌జా పాల‌న పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాడ‌ని వాపోయారు. రాచరిక పాల‌న కొన‌సాగుతోంద‌ని, ప్ర‌స్తుతం రియ‌ల్ ఎస్టేట్ దందా కొన‌సాగుతోంద‌ని ఆరోపించారు. సోమ‌వారం మీడియాతో మాట్లాడారు హ‌రీశ్ రావు. హైద‌రాబాద్ తో పాటు ఇత‌ర ప్ర‌ధాన న‌గ‌రాల‌లో ప్ర‌భుత్వ ఆస్తుల‌పై కొంద‌రు క‌న్నేశార‌ని వాపోయారు. ఇక ఎక్క‌డ ప‌డితే అక్క‌డ క‌బ్జాల‌కు తెర లేపార‌ని మండిప‌డ్డారు. అయినా తాము అడ్డుకుని తీరుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు.

ఇదిలా ఉండ‌గా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కొహెడ ఫ్రూట్ మార్కెట్ భూమిని అమ్మేసే కుట్రకు తెర లేపాడ‌ని ఆరోపించారు. 15 కోట్లకు ఒక ఎకరం అంటే 200 ఎకరాలకు సంబంధించి 3000 కోట్ల రూపాయల విలువైన భూమిని దళారులకు కట్టబెడుతున్నారని, దీనిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. కేరళ నుండి దళారులు వచ్చి లీలా హోటల్లో చర్చలు జరిపినట్లు సమాచారం కూడా ఉందన్నారు హ‌రీశ్ రావు.
ఈ భూమిని ఇచ్చి, దిల్( డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) భూమిలో మార్కెట్ కట్టుకోండి అంటున్నారని అన్నారు. ఆ దిల్ భూములపై ఏపీ ప్రభుత్వం కేసు వేసిందన్నారు. ఆ భూములు ఇప్పట్లో వచ్చేది లేదు మార్కెట్ కట్టేది లేదన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *