మెగా క‌ల్చ‌ర‌ల్ ఫెస్ట్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ

Spread the love

ఆవిష్క‌రించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న మెగా కలర్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకల పోస్టర్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో యూనివర్శిటీ అధికారులు పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ నెల 8వ తేదీన జరగనున్న ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సంద‌ర్బంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సానుకూలంగా స్పందించారు.

ఆంధ్రా విశ్వ విద్యాల‌యానికి ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంద‌న్నారు. ఎంద‌రో గొప్ప వ్య‌క్తులు, మ‌హానుభావుల‌ను ఈ యూనివ‌ర్శిటీ అందించింద‌ని అన్నారు. వారిని స్పూర్తిగా తీసుకుని తాను జ‌న‌సేన పార్టీని స్థాపించాన‌ని తెలిపారు. ఇలాంటి మంచి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నందుకు పేరు పేరునా యూనివ‌ర్శిటీ బాధ్యుల‌ను ప్ర‌శంసించారు డిప్యూటీ సీఎం.

ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ రెక్టార్ ప్రొఫెసర్ పులిపాటి కింగ్ , యూనివర్శిటీ క్రీడా విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ మోహన్ , దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా అధ్యయన కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ పల్లవి , రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మెంబర్ సెక్రటరీ కోటమరాజు శరత్ పాల్గొన్నారు.

  • Related Posts

    సీఎంతో జేసీ దివాక‌ర్ రెడ్డి క‌ర‌చాల‌నం

    Spread the love

    Spread the loveసోద‌రుడు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడా అనంత‌పురం జిల్లా : అనంత‌పురం జిల్లాలో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. జ‌ల‌హార‌తి కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న తాడిప‌త్రి వేదిక‌గా దీనిని ప్రారంభించారు.…

    దండి మార్చ్ 2.0 సైకిల్ యాత్రకు ఘన స్వాగతం

    Spread the love

    Spread the loveసమాజానికి స్ఫూర్తిగా నిలవాల్సింది యువతే. తిరుపతి /శ్రీకాళహస్తి : డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిర్వహిస్తున్న “దండి మార్చ్ 2.0” సైకిల్ యాత్రను తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియం లొ జిల్లా కలెక్టర్ , తిరుపతి జిల్లా ఎస్పీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *