Friday, 16 October 2026

స్మార్ట్ లాక్ డౌన్ విధించిన పాకిస్తాన్

newsseals-SmartLockDown

ఆర్థిక సంక్షోభం, ఇంధ‌న కొర‌త కార‌ణం

పాకిస్తాన్ : పాకిస్తాన్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దేశ ప్ర‌జ‌ల‌కు ఆందోళ‌న క‌లిగించేలా నిర్ణ‌యం తీసుకుంది. ఈమేర‌కు ప‌శ్చిమాశియాలో చోటు చేసుకున్న యుద్దం కార‌ణంగా దేశ ప్ర‌ధాన‌మంత్రి జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత నేపథ్యంలో పాకిస్థాన్ లో ‘స్మార్ట్ లాక్‌డౌన్’ విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా తలెత్తిన తీవ్ర ఆర్థిక సంక్షోభం, తీవ్ర ఇంధన కొరతతో దేశం సతమతమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు పీఎం న‌వాజ్ ష‌రీఫ్‌.
ఇంధన పొదుపు చర్యలలో భాగంగా, షాపింగ్ మాల్స్‌ను రాత్రి 8:00 గంటలలోపు, బేకరీలు, రెస్టారెంట్లు, ధాబాలు, ఫంక్షన్ హాళ్లను రాత్రి 10:00 గంటలలోపు మూసి వేయాలని ఆదేశించారు. ఈ రోజు నుంచి ఈ లాక్‌డౌన్ అమల్లోకి వస్తుందని తెలిపారు.

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఆంక్షలు పంజాబ్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్, గిల్గిట్-బాల్టిస్తాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) అంతటా అమలు చేయబడతాయ‌ని స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *