ఏబీఎన్ రాధాకృష్ణా జ‌ర జాగ్ర‌త్త : వైఎస్ జ‌గ‌న్

VijayaBhaskar · April 9, 2026
Spread the love

పిచ్చి రాత‌లు రాస్తే తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వు

తాడేప‌ల్లి గూడెం : ఏబీఎన్ , ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ‌పై నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. మీడియా చేతిలో ఉంది క‌దా అని ఎలా ప‌డితే అలా రాస్తానంటే కుద‌ర‌ద‌ని అన్నారు. ఆధారాలు లేకుండా అడ్డ‌గోలు రాత‌లు రాసి, ప్ర‌సారం చేస్తే చూస్తూ ఊరుకుంటామ‌ని అనుకోవ‌డం భ్ర‌మ అన్నారు. ఇంకోసారి ఇలాంటి చిల్ల‌ర కామెంట్స్ చేస్తూ కొత్త ప‌లుకు పేరుతో చెత్త ప‌లుకులు రాయాల‌ని చేసినా లేదా ప్ర‌య‌త్నించినా తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

కొంచెం వ‌ళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ప్ర‌వ‌ర్తిస్తే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. అమ‌రావ‌తి రాజ‌ధాని పేరుతో నారా చంద్రబాబు నాయుడు, ఆయ‌న ప‌రివారం చేస్తున్న రియ‌ల్ ఎస్టేట్ దందా గురించి రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రికి తెలుస‌న్నారు. నిస్సిగ్గుగా క‌మ్మ కులానికి వ‌త్తాసు ప‌లుకుతూ నీ లోని కుల అహంకారాన్ని ప్ర‌ద‌ర్శించాల‌ని చూస్తే బ‌డిత పూజ త‌ప్ప‌ద‌న్నారు.

త‌మ పార్టీకి చెందిన శాంతియుతంగా స్పందించార‌ని, ఇంకోసారి గీత దాటి చిల్ల‌ర వేషాలు వేస్తే ప్ర‌త్య‌క్షంగా దాడుల‌కు దిగే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు. మీడియా పేరుతో రెచ్చిపోతున్న ఏబీఎన్‌ రాధాకృష్ణ గతి తప్పి తమ పార్టీ నాయకులపై విమర్శలు చేశారని, వారి ఇళ్లలోని మహిళలపైనా అసభ్య పదజాలం ఉపయోగించారని వైయస్‌ జగన్‌ ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చాక గట్టిగా బుద్ధి చెబుతామన్న ఆయన, ఎవ్వరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.