పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ లో సింగ‌ర్ మంగ్లీ

త‌న‌పై ఆరోప‌ణ‌లు అబ‌ద్ద‌మంటూ ఫిర్యాదు

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ గాయ‌ని మంగ్లి అలియాస్ స‌త్య‌వ‌తి రాథోడ్ సంచ‌ల‌నంగా మారారు. త‌నపై ఇప్ప‌టికే ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. డ్ర‌గ్స్ కు సంబంధించిన కేసు కూడా కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో మ‌రోసారి సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. ఇప్పుడు ఏకంగా బెదిరింపుల‌కు దిగ‌డం, రూ. 10 కోట్లు తీసుకుని మోసానికి పాల్ప‌డ‌డం, ఆపై ఇచ్చిన బాధితుల‌ను చంపుతాన‌ని వార్నింగ్ ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపింది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను విస్తు పోయేలా చేసింది. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ మంగ్లీ దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టారు. తాను కూడా ఓ లాయ‌ర్ ను వెంటేసుకుని ఏకంగా త‌న‌పై కేసు న‌మోదు చేసిన హైద‌రాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ కు వ‌చ్చారు.

గాయని మంగ్లి సింగపోగు సుబ్బుపై వేధింపులు, బెదిరించి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించారంటూ ఆరోపిస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుబ్బు తన కార్యాలయానికి వచ్చి రూ. 10 లక్షలు డిమాండ్ చేశారని వాపోయారు. తాను అందుకు నిరాకరించినప్పుడు, అతను తనను దూషించడమే కాకుండా, మీడియా ద్వారా తన పరువు తీస్తానని బెదిరించారని మంగ్లీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, అదే పోలీస్ స్టేషన్‌లో న్యాయవాది సుబ్బారావు కూడా మంగ్లిపై మరో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

  • Related Posts

    పాన్ మ‌సాలా ప్ర‌చారంపై బాలీవుడ్ న‌టుల‌కు నోటీసులు

    ముంబై : విమల్ యాలాకుల‌ ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ , టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రాథమికంగా నిషేధిత పాన్ మసాలా , పొగాకు సంబంధిత ఉత్పత్తుల…

    జై శ్రీ‌రామ్ పేరుతో దాడులు చేస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె తాజాగా హిందూ సంస్థ‌ల‌ను టార్గెట్ చేశారు. మ‌రో వివాదానికి తెర తీశారు. ప్ర‌స్తుతం దేశంలో హిందూ సంస్థ‌ల హ‌వా కొన‌సాగుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *