అమరావతి బిల్లు ఆమోదించినందుకు కంగ్రాట్స్
న్యూఢిల్లీ : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. సోమవారం ఆయన మర్యాద పూర్వకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఏపీ రాష్ట్రానికి సంబంధించి రాజధానిగా అమరావతి బిల్లుపై సంతకం చేసినందుకు ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు. అంతకు ముందు ముర్మును ఘనంగా సన్మానించారు నారా లోకేష్. మంత్రితో పాటు కేంద్ర మంత్రులు, ఏపీకి చెందని పార్లమెంట్ సభ్యులు కూడా హాజరయ్యారు.
అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు ఎంపీలు. ఈ సందర్భంగా అమరావతి చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లోకేష్ వివరించారు. ప్రెసిడెంట్ ను కలిసిన అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రజలను రాజధాని పేరుతో మోసం చేసిందని అన్నారు. కానీ ఎప్పుడైతే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందో ఇచ్చిన మాట నిలబెట్టు కోవడం జరిగిందన్నారు లోకేష్.






