Saturday, 17 October 2026

అంబేద్క‌ర్ భార‌తీయ చిహ్నం కాదు ప్ర‌తిఘ‌ట‌న‌కు ప్ర‌తీక‌

newsseals-DRBRAmbedkar

ఏప్రిల్ 14న బాబా సాహెబ్ 135వ జ‌యంతి..ఘ‌నంగా నివాళి

హైద‌రాబాద్ : భార‌త దేశ రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ 135వ జ‌యంతి ఇవాళ‌. దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14న ప్ర‌జ‌లు ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులు అర్పిస్తున్నారు. పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాలు, బ‌హుజ‌నుల , తాడిత‌, పీడిత కులాల అభ్యున్న‌తి కోసం ఎంత‌గానో కృషి చేశారు. డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ రాజ్యాంగ‌ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా , మార్గ‌ద‌ర్శ‌కుడిగా నిలిచారు.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం అహ‌ర్నిశ‌లు కృషి చేసిన యోధుడు. అంటరానితనం నిర్మూలన కోసం ఆర్టిక‌ల్ 17ను రూపొందించారు. దళిత సాధికారత కోసం బహిష్కృత హితకారిణి సభను స్థాపించారు జల హక్కుల కోసం మహాద్ సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు.

భూ సంస్కరణలు, మహిళల కార్మిక హక్కుల కోసం వాదించారు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్. కేంద్ర బ్యాంకు, ఆర్థిక ప్రణాళికా చట్రాన్ని ప్రతిపాదించారు. ఆయ‌న నేటికీ చర్చనీయాంశంగా ఉన్న సవాళ్లను ముందుగానే ఊహించారు. కుల హింస నుండి విద్యా అంతరాల వరకు అంబేద్కర్ పోరాడిన అనేక సమస్యలు నేటికీ ఉన్నాయి. జ్ఞానం అణచివేతను ఛేదించగ లదన్న ఆయన నమ్మకం నేటి యువతకు ప్రత్యేకంగా శక్తివంతమైనది. కులం, లింగం, వర్గం ఆధునిక ఉద్యమాలకు చోదకశక్తిగా నిలిచే భావనలను అనుసంధానించారు. అంబేద్కర్ సందేశం భారతదేశానికే పరిమితం కాకుండా, విదేశాలలో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ , దళిత హక్కుల ఉద్యమాల వంటి వాటిని ప్రభావితం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *