newsseals.com
News

దేశానికి దిక్సూచి డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్

VijayaBhaskar April 14, 2026
newsseals-YSJagan
Spread the love

ఘ‌నంగా నివాళులు అర్పించిన మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి : డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ సూర్య చంద్రులు ఉన్నంత వ‌ర‌కు నిలిచే ఉంటార‌ని అన్నారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. భార‌త దేశానికి దిక్సూచి అని పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం 135వ అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్బంగా తాడేప‌ల్లి గూడెంలోని పార్టీ కార్యాల‌యంలో చిత్ర ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. కోట్లాది మందికి భార‌త రాజ్యాంగం ద్వారా స్పూర్తి దాయ‌కంగా నిలిచార‌ని పేర్కొన్నారు.
.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, పినిపె విశ్వరూప్, మేరుగు నాగార్జున, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌బాబు, ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు, పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు, పార్టీ పబ్లిసిటీ వింగ్‌ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, వేమూరు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబుతో పాటు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.